“ఆచార్య” ధర్మస్థలి సెట్ కి మంటలు..! ఈ ఘటన ఎలా జరిగిందంటే..?

“ఆచార్య” ధర్మస్థలి సెట్ కి మంటలు..! ఈ ఘటన ఎలా జరిగిందంటే..?

by Megha Varna

Ads

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెర మీదకి తీసుకు వచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ డిజాస్టర్‏ అయ్యింది. చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ ‏లో చరణ్, చిరు కలిసి నటించారు.

Video Advertisement

దాంతో మెగాభిమానులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమా కి వెళ్లారు. కానీ నిరాశే మిగిలింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే బాలేదంటూ ఈ మూవీ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఆచార్య సినిమా షూటింగ్ టైమ్‌ లో భారీ టెంపుల్ సెట్‌ ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సెట్ కి తాజాగా మంటలు అంటుకున్నాయి. సెట్ మొత్తం మంటల్లో కాలింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ షికార్లు కొడుతోంది. అక్కడ వున్న కొందరు ఈ వీడియో ని తీశారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొందరు కూర్చున్నారు. సిగరెట్ కాల్చారని… ఆ తరవాత కొన్ని నిమిషాల కి మంటలు వ్యాపించాయి అని రికార్డ్ అయిన వీడియో లో వుంది. వీడియో బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఇవన్నీ వినపడుతున్నాయి.

మంటలు అంటుకుని సెట్ మొత్తం కాలి పోయింది. అలానే ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేయండని మంటలు పూర్తిగా వ్యాపించకుండా కాల్ చేయండంటూ వీడియో బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఎవరో అంటున్నారు. ఇది కూడా మనం వినచ్చు. ఇక ఈ సెట్ విషయానికి వస్తే… దీన్ని హైదరాబాద్ శివార్లలోని కోకాపేట లో సుమారు 20 ఎకరాల్లో వేసారట. సురేష్ సెల్వరాజన్ రూ. 23 కోట్లు ఖర్చు చేసి ఈ సెట్ ని వేయించారు. ఈ మూవీ ని నిర్మాతలు ఎంతో ఖర్చు పెట్టి తెర మీద కి తీసుకు వచ్చారు. కానీ ఈ మూవీ డిజాస్టర్‏ అయ్యింది.


End of Article

You may also like