ఆచార్య ప్రీ సేల్స్ యూఎస్ లో పడిపోవడానికి కారణం ఇదేనా..?

ఆచార్య ప్రీ సేల్స్ యూఎస్ లో పడిపోవడానికి కారణం ఇదేనా..?

by Megha Varna

Ads

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో కొరటాల శివ దర్శకత్వం లో “ఆచార్య” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు నటించారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.

Video Advertisement

ఈ సినిమా ఏప్రిల్ 29 న అంటే రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటం తో ఫిలిం మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ని కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు.

అయితే ఒక వార్త మాత్రం మెగా ఫ్యాన్స్ ని కలవర పెడుతోంది అనే చెప్పాలి. అదేంటంటే ఆచార్య సినిమా యూఎస్ మార్కెట్ పై అంతగా ప్రభావం చూపించ లేక పోతోంది అని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కేజిఎఫ్-2 సినిమా రెండూ కూడా సూపర్ హిట్ లు అందుకున్నాయి.

పైగా అక్కడ భారీ కలెక్షన్లు కూడా ఈ సినిమాలు రాబట్టాయి. దీంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పైన యూఎస్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమవుతోంది. పైగా ఆచార్య సినిమా కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఓపెన్ అయినా కూడా బాగా ప్రీ సేల్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

ఈ  సేల్స్ ని పరిశీలించి చూస్తుంటే ఆచార్య సినిమా పై అక్కడ ఆడియన్స్ కి పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే తెలుస్తోంది. అయితే మరి రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఏమైనా వస్తాయో లేదో అనేది ఇప్పటికి ప్రశ్నార్థకమే. ఏమవుతుందో మరి చూడాలి.


End of Article

You may also like