Ads
- చిత్రం : ఆచార్య
- నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్.
- నిర్మాత : నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్
- దర్శకత్వం : కొరటాల శివ
- సంగీతం : మణి శర్మ
- విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా ధర్మస్థలి అనే ఒక ప్రదేశంలో మొదలవుతుంది. అక్కడ సిద్దవనం అనే ఒక ఊరిలో ఉండే ప్రజల చుట్టూ కథ నడుస్తుంది. అక్కడ ఉండే ప్రజలపై బసవ (సోనూ సూద్) అనే వ్యక్తి అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఆ ఊరికి ఆచార్య (చిరంజీవి) అనే వ్యక్తి వస్తాడు. అసలు ఆచార్య అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? సిద్ధ (రామ్ చరణ్) కి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? నీలాంబరి (పూజా హెగ్డే) ఎవరు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు. ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, మెగా స్టార్ ఆచార్య పాత్రలో బాగా చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినప్పటికి నటించడానికి కూడా పెద్దగా ఆస్కారం లేదు. రామ్ చరణ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ పాత్రలో కనిపిస్తారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఆకట్టుకునేలాగా అనిపించదు.
తన పాత్ర వరకు తాను బానే చేశారు. కాజల్ అగర్వాల్ పాత్ర పూర్తిగా కట్ చేశారు. దాంతో సినిమాలో ఏదో వెలితి ఉన్నట్టు అనిపిస్తుంది. పూజా హెగ్డే పాత్ర కూడా ఒక రోటీన్ హీరోయిన్ పాత్రలాగా ఉంటుంది. సోనూ సూద్ ఎప్పటిలాగానే విలన్ పాత్రలో బాగా నటించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, నాజర్ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మణి శర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వలేదు ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించడం
- యాక్షన్ సీన్స్
- ఒకటి రెండు పాటలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- వర్కౌట్ అవ్వని ఎమోషన్స్
- చాలా స్లోగా అనిపించే సీన్స్
- కొత్తదనం లేని పాత్రలు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, చిరంజీవి, రామ్ చరణ్ కోసం సినిమా చూద్దాం అనుకునేవారికి ఆచార్య ఒక్కసారి చూడగలిగే సినిమాలాగా నిలుస్తుంది.
End of Article