ఈ “హీరో” చెంప చెళ్లుమనిపించిన షూటింగ్ సిబ్బంది..! ఏం జరిగిందంటే..?

ఈ “హీరో” చెంప చెళ్లుమనిపించిన షూటింగ్ సిబ్బంది..! ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

సీరియల్ షూటింగ్‌ సెట్‌లో హీరో అతి దూకుడు టెక్నీషియన్స్ చేత తన్నులు తినేలా చేసింది. బుల్లితెర హీరో, నటుడు సిబ్బందిపై చేయి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్ హీరో చందన్‌కుమార్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓవరాక్షన్ చేశాడు. దీంతో అందుకు తగ్గ కౌంటర్ ఇచ్చారు యూనిట్. అతని చెంప చెల్లుమనిపించారు. ఆయనో హీరో… కాకపోతే సీరియల్స్‌లో పేరు చందన్ కుమార్. సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ చేశాడు. ప్రస్తుతం తెలుగులో “శ్రీమతి శ్రీనివాస్‌” సీరియల్‌‌లో నటిస్తున్నాడు.

 

ఈ సీరియల్ షూటింగ్‌ సందర్భంగా సదరు హీరో.. ఓవరాక్షన్ చేశాడు. షూటింగ్ వర్క్ చేస్తున్న టెక్నిషియన్ ను నానాబూతులు తిట్టాడు. హీరోయిజమంటే రౌడీలా బిహేవ్‌ చెయ్యడం అనుకున్నట్టున్నాడు. టెక్నిషియన్‌ పై నోరుపారేసుకుని వీరలెవెల్లో పోజులిచ్చాడు. దీంతో చిత్ర యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన తల్లిని దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు.

ఇప్పుడు బుల్లితెర హీరో చందన్‌పై దాడి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఏదో చిన్న టెక్నిషియన్ కదా! తన లెవెల్ చూపిద్దామనుకుంటే మొత్తానికే మోసం వచ్చింది. చందన్‌ చెంపపగలగొట్టి మరీ బుద్ధి చెప్పారు. శ్రీమతి శ్రీనివాస్‌ సీరియల్‌ షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం రేపింది. చివరకు చందన్ సారీ చెప్పక తప్పలేదు. ఓ పక్క పరువు పోయి, మరో పక్క రౌడీగా మిగిలిపోయాడు హీరో. కాగా నెల రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా వీడియో బయటకు వచ్చింది.

WATCH VIDEO:

చందన్ చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కన్నడలో ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి సీరియల్స్‌లో నటించాడు. అనేక రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నాడు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 3 షోకి కంటెస్టెంట్‌ గా కూడా వెళ్లాడు. అతను 2021 లో టీవీ నటి కవితా గౌడను వివాహం చేసుకున్నాడు.


End of Article

You may also like