ఒకప్పటి ఈ విలన్ కొడుకులు…ఇప్పుడు హీరోలు అని మీకు తెలుసా.?

ఒకప్పటి ఈ విలన్ కొడుకులు…ఇప్పుడు హీరోలు అని మీకు తెలుసా.?

by Mohana Priya

డిఫరెంట్ పాత్రలతో కన్నడ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరు తెచ్చుకున్న నటుడు దేవరాజ్. దేవరాజ్ బెంగళూరు లోని లింగ రాజ్ పురం లో పుట్టారు. దేవరాజ్ కి మూడు నెలలు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారు. 1976లో ఆర్థిక సమస్యల కారణంగా దేవరాజ్ హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ లో ఉద్యోగంలో చేరారు. అక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాలు పని చేశారు.

Video Advertisement

దేవరాజ్ సీనియర్ కొలీగ్ అయిన హెచ్ఎంటి గోవిందరాజు, దేవరాజ్ ని డ్రామాల్లో యాక్ట్ చేయమని సలహా ఇచ్చారు. అలా కొన్ని థియేటర్ గ్రూప్స్ తో పని చేసిన తర్వాత 1985 లో త్రిశూల అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దేవరాజ్. కానీ ఆ సినిమా విడుదల అవ్వలేదు.

దేవరాజ్ నటించిన 1986 లో వచ్చిన 27 మావల్లి సర్కిల్ సినిమా విడుదలైంది. తర్వాత వరుసగా ఎన్నో కన్నడ సినిమాల్లో నటించారు. 1990లో వచ్చిన 20వ శతాబ్దం దేవరాజ్ నటించిన మొదటి తెలుగు సినిమా.తర్వాత ప్రేమ యుద్ధం, ఎర్రమందారం, బంగారు బుల్లోడు, ఎస్పీ పరశురామ్, అన్న, సమరసింహారెడ్డి, యగ్నం, యోగి, ఎవడైతే నాకేంటి, లక్ష్యం సినిమాల్లో నటించారు. భరత్ అనే నేను లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ అయిన అపోజిషన్ లీడర్ శ్రీపతిరావు పాత్ర పోషించారు దేవరాజ్.

కన్నడ, తెలుగుతో పాటు నాలుగు తమిళ సినిమాల్లో కూడా నటించారు. 1986 లో నటి చంద్రలేఖ ని పెళ్లి చేసుకున్నారు దేవరాజ్. వాళ్లకి ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ కూడా నటులే.ఒక కొడుకు ప్రజ్వల్ కన్నడలో స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకొక కొడుకు ప్రణామ్, కుమారి 21 ఎఫ్ కన్నడ రీమేక్ తో డెబ్యూట్ చేశారు. ఈ సినిమా 2018 లో కుమారి 21 ఎఫ్ పేరుతోనే విడుదలైంది.


You may also like