ప్రముఖ నటుడు “ఇర్ఫాన్ ఖాన్” మృతి…శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ!

ప్రముఖ నటుడు “ఇర్ఫాన్ ఖాన్” మృతి…శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ!

by Anudeep

Ads

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేటి క్రితమే మరణించారు. ఆయన వయసు 54. మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌. ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఏప్రిల్25 ఉదయం కన్ను మూసారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో అందరిని కన్నీటిపర్యంతం చేసింది.

Video Advertisement

ప్రముఖ దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది.అందులో నటించిన విలన్ ఇర్ఫాన్ ఖాన్..నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.బాలీవుడ్ లో స్టార్ హీరో గా పేరుని సంపాదించుకున్న ఇర్ఫాన్ ఖాన్.తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికి గుర్తు ఉండే ఉంటారు.బాలీవుడ్ లో ఇర్ఫాన్ చేసిన ‘ది లై అఫ్ పై’ స్లం డాగ్ మిలెనినియర్ చిత్రాలకి జాతీయ స్థాయిలో అవార్డులు రాగా పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

సుమారు 70 పై చిలుకు సినిమాలలో నటించిన ఇర్ఫాన్ ఖాన్ గత కొద్దీ రోజులుగా తీవ్ర అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్నారు. గుర్తు తెలియని కాన్సర్ వ్యాధి తన ఆరోగ్యాన్ని చాలా దెబ్బ తీసింది.వైద్యులు సైతం కొంత కాలం ఆయనకి విరామం తీసుకోమని సూచించారు.ఇర్ఫాన్ సైతం ఎటువంటి షూటింగ్స్ లో పాల్గొనడం లేదు.ఇటీవలే ఇర్ఫాన్ ఆరోగ్యం మరింత క్షణీనించిందని తెలిసింది.ఇర్ఫాన్ ఖాన్ ను కుటుంబ సభ్యులు ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆయనకు ఉన్న దృఢమైన సంకల్ప శక్తి, అభిమానుల,శ్రేయోభిలాషుల ప్రేమ అనురాగాలతో అతి త్వరలోనే ఆయన కోలుకొని మనముందుకు వస్తారు అనుకున్నారు అభిమానులు .ఖాన్ ఇదివరకే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి విదితమే.గతంలో ఆయన లండన్ లో చికిస్స తీసుకున్నారు..గత ఏడాది సెప్టెంబర్ లోనే అయన ముంబై చేరుకున్నారు.ఇటీవలే ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మరణించారు.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా జైపూర్ లో జరిగిన తల్లి అంతిక్రియలకి సైతం హాజరు కాలేదు.


End of Article

You may also like