Home Filmy Adda “కోటిన్నర పెట్టి కొన్న కొత్త ఇల్లు…అప్పుడే ఇలా అయిపొయింది.?”…యాంకర్ వీడియో వైరల్.!

“కోటిన్నర పెట్టి కొన్న కొత్త ఇల్లు…అప్పుడే ఇలా అయిపొయింది.?”…యాంకర్ వీడియో వైరల్.!

by Anudeep

కరోనా సమయం నుంచి చాలా మంది సెలెబ్రెటీలు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండటం మొదలుపెట్టారు. చాలా మంది బుల్లితెర, వెండితెర సెలెబ్రెటీలు యూట్యూబ్ చానెల్స్ ఓపెన్ చేసి వారి వ్యక్తిగత విషాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు.
వారిలో ఒకరు సీనియర్ యాంకర్, నటి అయిన నవీన. యాంకర్ నవీన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సీరియల్స్ లో నటిస్తున్న ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.

actor naveena about her house builer cheating
ఒక వైపు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే తన యూట్యూబ్ ఛానల్ లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అనేక వీడియోలు చేశారు. ఇదిలా ఉంటే నవీన కోటిన్నర పెట్టి హైదరాబాద్ సిటీ కి కాస్త దూరంగా ఉన్న ఒక ఏరియా లో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. దాని గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియో ను కూడా ఆమె ఛానల్ లో షేర్ చేశారు.

actor naveena about her house builer cheating
తాజాగా పడిన వర్షాలకు కస్టపడి కొనుక్కున్న ఆ ఇంటి లోపలి భాగాల్లో పెచ్చులు ఊడిపోయి ఇంట్లోకి నీరు రావడంతో నవీన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా దానికి సంబంధించిన వీడియోని కూడా యూట్యూబ్ లో షేర్ చేసిందామె. నవీన షేర్ చేసిన వీడియోలో ఆ ఇల్లు బయటి నుంచి ఎంతో అందంగా ఉన్నప్పటికీ లోపల మొత్తం పాడైపోయింది.

actor naveena about her house builer cheating
బిల్డర్ చేసిన మోసాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న ఆ వీడియో లో సీలింగ్ మొత్తం ఊడిపోయి ఖరీదైన సామాను మొత్తం పాడైపోయాయి. ఇంట్లోకి కరెంటు కూడా రాకుండా మొత్తం వర్షం కురుస్తూనే ఉందని నవీన ఆ వీడియో లో తెలిపారు. ఆ బిల్డర్ కన్స్ట్రక్షన్ కోసం కోటి రూపాయలు తీసుకున్నాడని, అది కాకుండా తమకు మరో పాతిక లక్షలు ఖర్చు అయ్యిందని నవీన తెలిపారు. ఇప్పుడు ఈ రిపేర్లు చేయించాలంటే మరో అయిదారు లక్షలు ఖర్చవుతుందని ఆమె వాపోయారు.ఈ వీడియోని చూసిన ఆమె అభిమానులు సదరు బిల్డరుపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

watch video:

You may also like