మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర సీమలో నాలుగు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న నటుడు. ఏ జనరేషన్ వారైనా సరే మెగాస్టార్ చిరంజీవికి అభిమానులే. ఎవరి సహాయం లేకుండా తన సొంత కష్టం మీద సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు.

Video Advertisement

మెగాస్టార్ చిరంజీవి వల్ల ఎందరో మెగా హీరోలు సినీ ఇండస్ట్రీ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్,సాయి ధరంతేజ్ ఇలా అందరూ కూడా చిరంజీవి అండదండలతోటి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

 

చిరంజీవి అంటే ఒక మహా వృక్షమని ఎందరికో నీడనిచ్చిందని ఇండస్ట్రీలో జనం బయట జనం చెప్పుకుంటూ ఉంటారు. ఎందరికో దానాలు చేసిన చిరంజీవి ఎప్పుడు ప్రచారాన్ని కోరుకోలేదు. ఎందరో ఆర్టిస్టులకు జీవితాన్ని ప్రసాదించారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకు పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అలాంటిది చిరంజీవి వల్ల ఒక నటుడు కెరీర్ పోయిందని అంటే అందరూ ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మీరు విన్నది నిజమే. కాకపోతే దీని వెనకున్న అసలు విషయం ఏంటంటే…

1990 సంవత్సరంలో ప్రముఖ హాస్య నటుడు గిరిబాబు తన కుమారుడు బోసు బాబుని నటుడుగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఇంద్రజిత్ అనే కౌబాయ్ మూవీ ని తెరకెక్కించారు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహించారు,తానే నిర్మించారు.ఈ సినిమాని 1990 ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.కానీ అప్పుడే అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం సినిమా నెల తర్వాత రిలీజ్ అవ్వాల్సి ఉండగా, అనుకోకుండా ఆగస్టు 9న విడుదల తేదీని ప్రకటించారు.

4 chiranjivi

అయితే చిరంజీవి లాంటి స్టార్ హీరో తో పోటీ ఎందుకని గిరిబాబు వెనకడుగు వేశారు. చిరంజీవి కొదమసింహం సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది.చిరంజీవి నటించిన కౌబాయ్ సినిమానే జనం యాక్సెప్ట్ చేయలేదు అలాంటిది కొత్త నటుడుతో తీసిన కౌబాయ్ సినిమాను ఎవరు చూస్తారు అంటూ డిస్ట్రిబ్యూటర్లు వెనకడికి వేశారు.


దీంతో గిరిబాబు చేసేదేం లేక 40 లక్షల రూపాయలతో తీసిన సినిమాను 20 లక్షలు అమ్మేశారు. ఆఖరికి ఇంద్రజిత్ సినిమా సెప్టెంబర్ 28 1990 న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టింది. అయినా కూడా సినిమా ఫ్లాప్ అంటూ కొందరు నెగిటివ్ ప్రచారం చేశారని దీని వల్ల తన కొడుకు కెరీర్ పోయిందంటూ గిరిబాబు చెప్పుకొచ్చారు.

Also Read:అలియా భట్” కంటే ముందు… “రణబీర్ కపూర్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 11 మంది హీరోయిన్స్..!