Ads
ఎన్నో సినిమాల్లో హీరోగా, అలాగే సపోర్టింగ్ నటుడిగా ముఖ్య పాత్రల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సురేష్. సురేష్ శ్రీకాళహస్తిలో పుట్టారు. మొదటిగా ఎడిటింగ్ అసిస్టెంట్, ఆ తర్వాత డాన్స్ అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు సురేష్. 1981 లో వచ్చిన పన్నీర్ పుష్పంగళ్ అనే తమిళ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టారు.
Video Advertisement
అదే సంవత్సరం రామదండు అనే తెలుగు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత నుండి వరుసగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు సురేష్. 1984లో మలయాళం సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు సురేష్. సురేష్ కి తెలుగులో బాగా పేరు తీసుకు వచ్చిన సినిమాల్లో అమ్మోరు సినిమా ఒకటి.
ఇటీవల కూడా బాలకృష్ణ హీరోగా నటించిన లయన్, అలాగే జనతా గారేజ్, లక్కున్నోడు, విన్నర్, లై, హలో గురు ప్రేమ కోసమే, సుబ్రహ్మణ్యపురం సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు సురేష్. వీటితో పాటు కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు.
ఇటీవల ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. సురేష్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఆమె నటి అని, మంచి సింగర్ అని కూడా చెప్పారు.
కానీ తర్వాత వారిద్దరూ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినట్టు చెప్పారు. ఆ నటి మరెవరో కాదు అనితా రెడ్డి. అనితా రెడ్డి జంధ్యాల గారి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన “బాబాయ్ అబ్బాయి” సినిమాలో నటించారు. తర్వాత లెజెండరీ సింగర్ ఏసుదాసు గారి తో కలిసి కచేరీల్లో పాల్గొన్నారు. తర్వాత పాప్ సింగర్ గా కూడా ఎంతో పేరు సంపాదించారు అనితా రెడ్డి.
End of Article