Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ మూవీ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. టి. జి.విశ్వప్రసాద్ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు.
Video Advertisement
సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరించిన ఈ మూవీలో హీరోయిన్ గా కేతిక శర్మ నటించింది. టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. తొలి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీలో సాయి తేజ్ సెకండ్ సిస్టర్ గా నటించిన అమ్మాయి ఎవరో? ఇప్పుడు చూద్దాం..
బ్రో మూవీలో సాయి తేజ్ కి ఇద్దరు సిస్టర్లు ఉంటారు. వారిలో ఒకరు ప్రియా వారియర్ కాగా, రెండవ సిస్టర్ గా యువ లక్ష్మి నటించింది. ఆమె అసలు పేరు యువశ్రీ లక్ష్మి. ఆమె కోలీవుడ్ నటి, తమిళంలో పలు సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు లోని కారైకాల్ లో 2000వ సంవత్సరంలో డిసెంబర్ 25న జన్మించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన యువలక్ష్మికి భరతనాట్యం అంటే చాలా ఆసక్తి. ఆ నృత్యం నేర్చుకున్న ఆమె జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులను పొందింది.
ఆమె మొదటిసారి 2016 లో వచ్చిన అమ్మ కనక్కు అనే తమిళ చిత్రంలో అమలా పాల్ మరియు సముద్రఖనితో కలిసి నటించింది. ఆ తరువాత సముద్రఖని ‘అప్పా’ లో ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ‘ఆకాశమిత్తయి’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత శివకార్తికేయన్ నటించిన ‘వేలైకారన్ ‘ రాఘవ లారెన్స్ మూవీ కాంచన 3లో కూడా సహాయక నటి పాత్రలో యువ లక్ష్మి నటించింది. సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సీతమ్ సినిమాలో కూడా యువ లక్ష్మి కీలక పాత్రలో నటించింది. దూరదర్శన్ లో ప్రసారం అయిన సూపర్ కుటుంబంలో కూడా చేసింది. బ్రో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
https://www.instagram.com/p/CX53rNXJqCU/
Also Read: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?
End of Article