Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ విడుదల అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో శ్రీయా రెడ్డి నటించారు. రాధ రామ అనే క్యారెక్టర్ లో అలరించారు.
Video Advertisement
ఈ క్యారెక్టర్ సలార్ సినిమాకి కీలకంగా మారింది శ్రీయ రెడ్డి నటనకి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారందరూ శ్రీయా రెడ్డి ఎవరు అంటూ ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. అయితే శ్రీయా రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటి ఆమె పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం….!
శ్రీయా రెడ్డి 28 నవంబరు 1983 లో జన్మించారు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. గిరి స్టార్టింగ్ లో యాంకర్ గా , విజెగా పనిచేశారు. తర్వాత పలు సౌత్ ఇండియా భాషల్లో కూడా నటించారు. శ్రీయా తండ్రి మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి. సినిమాల్లోకి రాకముందు ఎస్.ఎస్.మ్యూజిక్ చానల్లో వీడియో జాకీగా పనిచేసారురు. 2002లో సమురాయ్ అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. ఆమె నటించిన బ్లాక్, తిమిరు, కాంచీవరం వంటి సినిమాల్లోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దొరికాయి.
తర్వాత తెలుగు,మలయాళీ చిత్రల్లో కూడా నటించారు. శ్రీయా రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతోటి ఎంట్రీ ఇచ్చారు తర్వాత 2006లో అమ్మ చెప్పింది అనే చిత్రంలో నటించారు. తర్వాత తెలుగులో మరే చిత్రంలోను నటించలేదు.తాజాగా ప్రభాస్ సలార్ సినిమాలో మళ్ళీ కనిపించారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో కూడా శ్రీయా రెడ్డి కీలకపాత్రలో నటిస్తున్నారు
End of Article