“బేబీ” మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ “సీత” పాత్రలో నటించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“బేబీ” మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ “సీత” పాత్రలో నటించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

‘బేబీ’ మూవీ మానియా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కూడా తగ్గడం లేదు. సాధారణంగా మూవీ బాగుంటే వారాంతంలో థియేటర్లు హౌస్ ఫుల్‌ కావడమే కష్టం. అలాంటిది ఈ ప్రేమకథా చిత్రంకు సోమవారం నాడు కూడా థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ మూవీ హిట్ అవడంతో చాలా మంది నటీనటులు లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

Video Advertisement

హీరోయిన్‌ వైష్ణవి చైతన్య, సెకండ్ హీరో గా నటించిన విరాజ్‌ అశ్విన్‌, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్‌లకు ఈ మూవీ ద్వారా గుర్తింపు వచ్చింది. వైష్ణవి చైతన్యకి కాలేజీ ఫ్రెండ్ సీతగా నటించిన అమ్మాయికి గుర్తింపు వచ్చింది. ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ మూవీకి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్‌ లభిస్తోంది. ‘తొలి ప్రేమ’ అనే కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవడంతో చిత్రబృందం సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన హీరో ఆనంద్‌ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌, దర్శకుడు సాయి రాజేశ్‌లకు ఈ మూవీతో మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. వీరితో పాటుగా హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన కుసుమ డెగల మర్రికి గుర్తింపు దక్కింది. ఇలా ఈ మూవీలో నటించిన వారందరికీ బేబీ మూవీ ఊహించనంత గుర్తింపును తీసుకొచ్చింది.
అయితే అందరూ ఆ బేబీ  హీరోయిన్ వైష్ణవి గురించే కాకుండా హీరోయిన్‌ కాలేజీ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పేరే ‘కిర్రాక్ సీత’. ఇప్పటికే ఆమె యూట్యూబ్‌ లో పలు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించింది. తెలుగు వెబ్ సిరీస్‌లలో నటించింది. షార్ట్ ఫిల్మ్‌లు ద్వారా సీత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 21 వెడ్స్ 30, పెళ్లికూతురు పార్టీ, సరయు, మూడు చేపల కథ వంటి వాటిలో నటించి ఆకట్టుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవర్స్‌ భారీగానే ఉన్నారు.

https://www.instagram.com/p/CuuZXFPAPEQ/

Also Read: సౌందర్య చనిపోయిన నెల తరువాత వాళ్ళింటికి వెళ్ళా..ఎంట్రన్స్ లో చూసి..? ఆమని సంచలన కామెంట్స్..!


End of Article

You may also like