Ads
ప్రస్తుతం ఓటిటి లలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. కామెడీ వెబ్ సిరీస్ లు, హర్రర్ వెబ్ సిరీస్ లు, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు అన్ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈటీవీ విన్ యాప్ లో అచ్చ తెలుగు వెబ్ సిరీస్ 90’s వచ్చింది.
Video Advertisement
ఇది 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఉంది. ఒక మధ్య తరగతి కుటుంబం అందులో పిల్లలు తల్లి తండ్రీ పాత్రలు ఇలా అన్నీ కూడా మన నిజ జీవితాల్లో చూసినట్టుగా రూపొందించారు. 90’s కిడ్స్ ఎవరున్నా సరే ఈ వెబ్ సిరీస్ కి బాగా కనెక్ట్ అవుతారు.
అయితే ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పాత్రలో ఒక అమ్మాయి నటించింది. తన పెద్ద పెద్ద కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. తన నటనతో హావభావాలతో మంచి మార్కులే కొట్టేసింది. ఈ సిరీస్ చూసిన అందరూ కూడా ఈమె ఎవరు అంటూ వెతకడం మొదలుపెట్టారు. ఈమె పేరు స్నేహల్ కామత్. ఈమె తెలుగులో ఇంతకుముందు చాలా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఈమె జీ ఫైవ్ లో గతంలో వచ్చిన కైలాసపురం వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా కూడా నటించింది.
ఈ సిరీస్ కూడా మంచి విజయం అయింది. తర్వాత అరవింద సమేత సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే ఫ్రెండ్గా కూడా నటించింది. సరిగ్గా చూస్తే తప్ప ఈ విషయం ఎవరికీ అర్థం కాదు. ఇవే కాకుండా పలు యూట్యూబ్ సీరియస్ లు ఈమె ఖాతాలో ఉన్నాయి అయితే 90’s వెబ్ సిరీస్ లో ఈమె నటనకు మాత్రం ఎక్కడలేని పొగడ్తలు వస్తున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించింది ఈమె. ఈ సిరీస్ తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
End of Article