Ads
సౌత్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా సూపర్ స్టార్ మేనియా కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధిస్తూ, రికార్డులను సృష్టిస్తోంది. రజనీకాంత్ తన నట విశ్వరూపంతో అలరించిన ఈ మూవీకి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
Video Advertisement
ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, సునీల్ కీలక పాత్రలలో నటించగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ అతిథి పాత్రలలో కనిపించారు. అయితే ఈ మూవీలో తమన్నా లవర్ బాగున్నారా బాబుగా నటించిన యాక్టర్ ప్రముఖ తెలుగు దర్శకుడి కుమారుడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జైలర్ మూవీ ఇప్పటివరకు 4 వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ మూవీలోని పలువురు నటులకు గుర్తింపు వచ్చింది. ఇంతవరకు వారు పలు సినిమాలలో నటించినా రాని పాపులారిటీ ఈ మూవీతో వచ్చింది. ఈ మూవీలోని నటులకు సంబంధించిన వివరాలను నెటిజెన్లు వెతికి మరి, వారి గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారి వివరాలు తెలిసిన తరువాత ఆశ్చర్యపోతూ, కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జైలర్ మూవీలో వేసుకున్న రజనీకాంత్ జైలర్ లో జైలర్‌లో తమన్నా లవర్ డైరెక్టర్ బాగున్నార బాలుగా నటించిన యాక్టర్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఆ నటుడి పేరు సునీల్ రెడ్డి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రాలలో కూడా సునీల్ రెడ్డి నటించాడు. డాక్టర్ మూవీలో మహాలి అనే పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత విజయయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీలో కూడా నటించారు.
ఈ సునీల్ రెడ్డి మరెవరో కాదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు. వైభవ్ రెడ్డికి అన్నయ్య. నటుడిగా మారకముందు సునీల్ రెడ్డి తండ్రి కోదండరామి రెడ్డి డైరక్షన్ చేసిన గొడవ, కాస్కో లాంటి తెలుగు సినిమాలకు సమర్పకుడిగా పనిచేశాడు.
End of Article