Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలకి మాత్రమే కాకుండా ముఖ్య పాత్రల్లో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామ రాజు చిన్నపాటి పాత్రలో నటించిన అబ్బాయి కూడా చాలా ఫేమస్ అయ్యాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కొంతసేపు ఆ అబ్బాయి కనిపిస్తాడు. ఆ పాత్ర పోషించిన అబ్బాయి పేరు వరుణ్ బుద్ధదేవ్. వరుణ్ కి ఇది మొదటి తెలుగు సినిమా. అంతకుముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించాడు. అలాగే చాలా ప్రకటనలలో కూడా నటించాడు.
image source: Instagram (Varun Buddhadev)
వరుణ్ మంచి డ్యాన్సర్ కూడా. తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి సీతారామరాజు పాత్ర పోషించడానికి నటుల కోసం రాజమౌళి వెతికారట. అపుడు వరుణ్ గురించి తెలిసి ఆడిషన్స్ కి పిలిచారు. వరుణ్ ఆ పాత్రకి సూట్ అవ్వడంతో సినిమాలో నటించడానికి వరుణ్ ని తీసుకున్నారు. అలా వరుణ్ తెలుగు సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాలో వరుణ్ 15 నిమిషాల వరకు కనిపిస్తాడు.
End of Article