Ads
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో చిరంజీవి చేసిన కృషికి ఈ పద్మ విభూషణ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా యంగ్ హీరోలకి పోటీగా చిరంజీవి నటిస్తూ తన సినిమాలని విడుదల చేస్తున్నారు.
Video Advertisement
అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నారు. అయితే చిరంజీవి నటించిన సినిమాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో చిరంజీవి నటన కూడా ప్రశంసలు పొందే విధంగా ఉంటుంది.
కానీ చిరంజీవికి ఇప్పటి వరకు ఒక్క జాతీయ అవార్డు కూడా రాలేదు. భవిష్యత్తులో చిరంజీవికి జాతీయ అవార్డు కూడా రావాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి కంటే ముందే మరొక తెలుగు నటుడు కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. ఆయన మరెవరో కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారు. 2011 లో అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మ విభూషణ్ లభించింది. అంతకుముందు 2006 సంవత్సరంలో చిరంజీవికి పద్మభూషణ్ లభించింది.
టాలీవుడ్ లో మొదటి పద్మ విభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. మళ్లీ ఇప్పుడు చిరంజీవి ఆ గుర్తింపు సాధించారు. సినిమాల్లో మాత్రమే కాకుండా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందుబాటులో ఉండేలాగా చేశారు. కరోనా సమయంలో కూడా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఆర్టిస్టులకి కూడా ఆర్థికంగా సహాయం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి చిరంజీవి ముందు వరుసలో ఉంటారు.
తనని తాను సినిమా పెద్దగా అనుకోను అని చెప్తారు కానీ, ఒక బాధ్యత తీసుకొని సినిమా వాళ్ళందరూ తన వాళ్లు అనుకొని ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా కూడా తన వంతు సహాయం చేస్తారు చిరంజీవి. అందుకే చిరంజీవికి పద్మ విభూషణ్ ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం అని చాలా మంది అన్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. బింబిసార సినిమాకి దర్శకత్వం వహించిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. సోషల్ ఫాంటసీ జోనర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అని సమాచారం. వారు ఎవరు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా బృందం అంతా షూటింగ్ పనిలో ఉన్నారు.
ALSO READ : షూటింగ్ సెట్ లోనే హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య..! అసలు ఏం జరిగిందంటే..?
End of Article