Ads
సినీ నటుల జీవితాలు చాలా విలాసవంతంగా ఉంటాయి. ఎక్కడికెళ్ళినా కూడా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు. ఖరీదైన వస్తువులను వాడతారు. వాళ్ళు బయటికి వచ్చారంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉండాల్సిందే. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఇంత పెద్ద స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో ఎవరికి తెలియదు. వాళ్ళని చూసి ఏదో ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారు అని అనుకుంటాం. కానీ అలా ఎదగడానికి చాలా కష్టపడతారు. ఎక్కడో చిన్న ఉద్యోగాల నుండి కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థాయికి చేరుకుంటారు. ఈ హీరో కూడా అలాగే చాలా కష్టపడి పైకి వచ్చారు.
Video Advertisement
మెకానిక్ గా తన జీవితాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యారు. సికింద్రాబాద్ లో పుట్టిన ఈ హీరో, తమిళ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇవాళ తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అజిత్ కుమార్ హైదరాబాద్ అతను అని చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి వెళ్లిన కొత్తల్లో తమిళ్ రాక ఇబ్బంది పడ్డారు. ఒక తెలుగు సినిమాలో కూడా అజిత్ నటించారు. అజిత్ చిన్నప్పుడు మెకానిక్ గా పని చేశారు. పదవ తరగతి వరకు చదువుకున్నారు. అజిత్ కి ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా బాగా వచ్చు. అజిత్ పుస్తకాల పురుగు.
ఎన్నో రకమైన పుస్తకాలని అజిత్ చదువుతారు. అంతే కాకుండా, అజిత్ ఒక రేసర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. రేసింగ్ లో పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే ముందు బైక్ మెకానిక్ అయ్యారు. ఆ తర్వాత ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం తర్వాత అజిత్ రేసింగ్ కి దూరంగా ఉన్నారు. అప్పుడు అజిత్ కి మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి. అలా 1992 లో ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళ్ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అజిత్ నటించిన తమిళ్ సినిమాలు అన్నీ కూడా తెలుగులోకి డబ్ అయ్యి విడుదల అవుతాయి. తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులని అజిత్ సంపాదించుకున్నారు.
ALSO READ : “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!
End of Article