Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా, మిగిలినవారి గెటప్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అలా పుష్ప సినిమాలో నటించే వారు సినిమాకి ముందు ఎలా ఉన్నారో, సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 అల్లు అర్జున్
పుష్ప సినిమా అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ మేకోవర్. ఈ సినిమాకోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. కేవలం గెటప్ విషయంలో మాత్రమే కాకుండా భాషలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
#2 రష్మిక మందన్న
రష్మిక కూడా శ్రీవల్లి పాత్ర కోసం చాలా మారారు. బహుశా ఇప్పటి వరకు రష్మిక ఇలాంటి పాత్రలు చేయలేదు ఏమో. ఇటీవల విడుదలైన సామి సామి పాటలు అయితే రష్మిక చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.
#3 ఫహాద్ ఫాజిల్
ఫహాద్ కి ఇది మొదటి తెలుగు సినిమా. ఈ సినిమాలో పోలీస్ గా ఫహాద్ కనిపించబోతున్నారు.
#4 సునీల్
ఈ సినిమాలో సునీల్ మంగళం శ్రీను పాత్రలో కనిపిస్తున్నారు. మొదటి పార్ట్ లో సునీల్ మెయిన్ విలన్ అని సమాచారం.
#5 అనసూయ భరద్వాజ్
అనసూయ ఫోటో అధికారికంగా విడుదల చేయలేదు. కానీ అనసూయ గెటప్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో అనసూయ కూడా అసలు ఇప్పటి వరకూ ఎప్పుడు పోషించని పాత్ర పోషిస్తున్నారు.
#6 ధనంజయ
ధనంజయ కన్నడ నటుడు. ఈ సినిమాలో ధనంజయ కూడా జాలి రెడ్డి అనే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
వీరు మాత్రమే కాకుండా, పుష్ప సినిమాలో ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు నటిస్తున్నారు. వారి పాత్రలకు సంబంధించిన వివరాలు, పోస్టర్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ చూస్తే సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోంది అని ముందే అర్థమైపోతోంది.
End of Article