Ads
డిఫరెంట్ కాన్సెప్ట్ లతో, డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ తేజ. తన సినిమాల ద్వారా తేజ ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 ఉదయ్ కిరణ్
చిత్రం సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు ఉదయ్ కిరణ్. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో నువ్వు నేను, ఔనన్నా కాదన్నా సినిమాలు కూడా వచ్చాయి.
#2 సదా
జయం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయమయ్యారు సదా.
#3 రీమాసేన్
చిత్రం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు రీమాసేన్.
#4 నితిన్
జయం సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టారు నితిన్.
#5 కాజల్ అగర్వాల్
లక్ష్మీ కళ్యాణం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు కాజల్.
#6 దక్ష నాగర్కర్
2015 లో తేజ దర్శకత్వంలో వచ్చిన హోరాహోరీ అనే సినిమాతో కెరీర్ ని మొదలు పెట్టారు దక్ష నాగర్కర్.
#7 రాజా చెంబోలు
ఫిదా, ఎవడు, మిస్టర్ మజ్ను, భానుమతి అండ్ రామకృష్ణ ఇలా ఎన్నో సినిమాల ద్వారా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న రాజా చెంబోలు ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కొడుకు. రాజా మొదటి సినిమా 2008లో వచ్చిన కేక. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు.
#8 నందిత
నీకు నాకు డాష్ డాష్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు నందిత.
#9 నవదీప్
2004 లో వచ్చిన జై సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నవదీప్.
#10 ప్రిన్స్
నీకు నాకు డాష్ డాష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు ప్రిన్స్.
#11 సంతోషి
జై సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు సంతోషి.
#12 ఆది పినిశెట్టి
ఒక v చిత్రం సినిమాతో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టారు ఆది పినిశెట్టి.
వీరు మాత్రమే కాకుండా జయం సినిమాతో సుమన్ శెట్టి, నువ్వు నేను సినిమాతో అనిత, తో పాటు ఇంకా ఎంతో మంది నటులు, ఇతర డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు డైరెక్టర్ తేజ.
End of Article