Ads
ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అయ్యింది.
Video Advertisement
బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అయ్యింది.
ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకుముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
రాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అని అంటున్నారు. సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. రాముడిగా ప్రభాస్ చేయక ముందే రాముడి పాత్రల్లో పలు హీరోలు కూడా నటించారు. మరి అలా రాముడి పాత్ర చేసి ఔరా అనిపించినా వాళ్ళ గురించి చూసేద్దాం.
1. యడవల్లి సూర్యనారాయణ:
యడవల్లి సూర్యనారాయణ ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో రాముడి పాత్ర చేశారు. ఇది తొలిసారి రామాయణం ఆధారంగా చేసిన చిత్రం.
2. అక్కినేని నాగేశ్వరరావు:
అక్కినేని నాగేశ్వరరావు తన మొట్టమొదటి సినిమాలో రాముడి పాత్ర చేశారు ‘సీతారామ జననం’ సినిమా లో ఏఎన్నార్ కి రాముడి పాత్ర చేసే అవకాశం దక్కింది.
3. హరనాథ్:
సీతారామ కళ్యాణం, శ్రీ రామ కథ చిత్రాలలో హరనాథ్ రాముడి పాత్ర పోషించారు.
4. రామారావు:
అత్యధిక సినిమాల్లో రాముడిగా కనిపించిన నటుడు ఈయన. సంపూర్ణ రామాయణం, లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలలో ఎన్టీ రామారావు రాముడు పాత్ర చేశారు.
5. కాంతారావు:
వీరాంజనేయ, సీతాకల్యాణం సినిమాలలో రాముడిగా కాంతారావు నటించారు.
6. శోభన్ బాబు:
‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో శోభన్ బాబు రాముడి పాత్ర చేసి ఆకట్టుకున్నారు.
7. జూనియర్ ఎన్టీఆర్:
బాల రామాయణం లో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర చేశారు. అది కూడా చిన్నప్పుడే నటించడం విశేషం.
8. సుమన్:
శ్రీరామదాసు సినిమా లో సుమన్ శ్రీరాముడిగా నటించారు.
9. శ్రీకాంత్:
దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ అందరి బంధువయా పాటలో రాముడిగా కనబడతారు.
10. ప్రభాస్
హీరో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో నటించారు.
11. అరుణ్ గోవిల్
ఈయన సీరియల్స్ లో రాముడిగా చాలా పేరు తెచ్చుకున్నారు. రామానంద్ సాగర్ రామాయణాన్ని సీరియల్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆ రామాయణంలో రాముడిగా అరుణ్ నటించారు. అప్పట్లో అరుణ్ రాముడిగా ఎంతో పాపులర్ అయ్యారు. సీరియల్ హిందీ అయినా కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులకి అరుణ్ తెలిసే ఉంటారు. చాలామంది ఆయనని రాముడిగా భావించి పూజలు కూడా చేశారు.
12. బాలకృష్ణ:
బాలకృష్ణని రాముడి పాత్రలో శ్రీరామరాజ్యం సినిమాలో చూపించారు. ప్రభాస్ ఇప్పుడు ఆది పురుష్ లో రాముడుగా నటిస్తున్నారు.
End of Article