Ads
ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు పరిచయం అవుతూ ఉంటారు. కొంత మందికి మొదటి సినిమాతోనే పేరు వస్తే ఇంకా కొంత మందికి పేరు రావడానికి సమయం పడుతుంది. అయితే, ఆలా చాలామంది సినీ ప్రముఖులకు మొదటి సినిమాతోనే పేరు వచ్చింది. ఆ సినిమా పేరే వారి ఇంటి పేరు అయిపోయింది. ఆలా వారి మొదటి సినిమాలని వారి పేరు ముందు చేర్చుకున్న సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 సత్యం రాజేష్
సత్యం సినిమాతో రాజేష్ పేరు తెచ్చుకున్నారు. అప్పటినుండి ఇప్పటి వరకు సత్యం రాజేష్ పేరుతోనే కొనసాగుతున్నారు.
#2 దిల్ రాజు
ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారి మొదటి సినిమా దిల్ అవ్వడంతో ఆ సినిమా తన పేరులో చేర్చుకున్నారు.
#3 సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సీతారామ శాస్త్రిగారు సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టారు.
#4 అల్లరి సుభాషిణి
అల్లరి సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన సుభాషిణి గారికి ఆ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. దాంతో అల్లరి సుభాషిణిగా ఫేమస్ అయ్యారు.
#5 వెన్నెల కిషోర్
వెన్నెల సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కిషోర్ ఆ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని వెన్నెల కిషోర్ గా గుర్తింపు పొందుతున్నారు.
#6 బొమ్మరిల్లు భాస్కర్
దర్శకుడిగా తన మొదటి సినిమా అయిన బొమ్మరిల్లుని తన పేరు పక్కన చేర్చుకున్నారు భాస్కర్.
#7 అల్లరి నరేష్
హీరోగా నరేష్ నటించిన మొదటి సినిమా అల్లరి అవ్వడంతో నరేష్ అల్లరి నరేష్ గా గుర్తింపు పొందారు.
#8 రంగస్థలం మహేష్
మహేష్ అంతకుముందు జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. కానీ రంగస్థలంలో తన పాత్రకి చాలా గుర్తింపు రావడంతో తర్వాత నుండి రంగస్థలం మహేష్ గా ఫేమస్ అయ్యారు.
#9 శుభలేఖ సుధాకర్
శుభలేఖ సినిమాతో సుధాకర్ గారు చాల గుర్తింపు తెచ్చుకున్నారు.
#10 బాహుబలి ప్రభాకర్
ప్రభాకర్ అంతకముందు చాలా సినిమాల్లో నటించినా కూడా బాహుబలి సినిమాతో ఇంకా గుర్తింపు రావడంతో బాహుబలి ప్రభాకర్ గా ఫేమస్ అయ్యారు.
#11 షావుకారు జానకి
షావుకారు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జానకిగారు షావుకారు జానకిగా గుర్తింపు పొందారు.
#12 ఛత్రపతి శేఖర్
శేఖర్ కూడా అంతకముందు చాలా సినిమాల్లో నటించినా కూడా ఛత్రపతి సినిమాతో చాలా గుర్తింపు పొందారు. ఆ తర్వాత నుండి ఛత్రపతి శేఖర్ గా పాపులర్ అయ్యారు.
ఇంకా చాలామంది నటులు ఇలాగే వారి కెరీర్ మొదలైన మొదటి సినిమాని కానీ, లేదా వారికి గుర్తింపు తీసుకువచ్చిన సినిమాని కానీ వారి ఇంటి పేరుగా మార్చుకున్నారు.
End of Article