Ads
సినిమా నటులు అడ్వర్టైజ్మెంట్స్ లో నటించడం అనేది చాలా సహజం. ఒకవేళ ఎవరైనా ఒక స్టార్ నటులు ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే, ఆ బ్రాండ్ విలువ పెరుగుతుంది అని చాలా మంది ఎంతో ఖర్చు పెట్టి ఎంతో మంది స్టార్ల చేత వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేయించుకుంటారు. అయితే కొంత మంది నటులు మాత్రం ఇలా అడ్వర్టైజ్మెంట్స్ కి దూరంగా ఉన్నారు. ఆ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 సాయి పల్లవి
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంత సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి, ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ రిజెక్ట్ చేశారట. సాయి పల్లవి ఎప్పుడో టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించారు. హీరోయిన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ లో నటించలేదు.
#2 మంచు మనోజ్
మంచు మనోజ్ కూడా ఇన్ని సంవత్సరాలలో ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు.
#3 నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇప్పటి వరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు. ఒక సందర్భంలో ఏదైనా మంచి కోసం ప్రచారం చేయాలంటే, సామాజిక బాధ్యత కోసం రూపొందించే అడ్వర్టైజ్మెంట్స్ లో నటిస్తాను అని చెప్పారు.
#4 గౌతమి
తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న గౌతమి గారు కూడా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించలేదు.
#5 మోహన్ బాబు
మోహన్ బాబు గారు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా నటించలేదు.
#6 నందమూరి కళ్యాణ్ రామ్
తన పెర్ఫార్మెన్స్ తో, సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కళ్యాణ్ కూడా టెలివిజన్ కమర్షియల్స్ లో నటించలేదు.
#7 మంచు విష్ణు
మంచు విష్ణు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో డిఫరెంట్ సినిమాలతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. మంచు విష్ణు కూడా ఇప్పటి వరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు.
వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది నటులు కూడా అడ్వర్టైజ్మెంట్స్ కి దూరంగా ఉన్నారు. శర్వానంద్, నాని, అజిత్, రజినీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అనుష్క శెట్టితో పాటు ఇంకా కొంత మంది నటులు తరచుగా కాకపోయినా చాలా అరుదుగా ఒక అడ్వర్టైజ్మెంట్ లో అయినా నటించారు.
End of Article