Home Filmy Adda “విజయ్ ఆంటోనీ” తో పాటు… తమ పిల్లల్ని కోల్పోయిన 7 నటులు..!

“విజయ్ ఆంటోనీ” తో పాటు… తమ పిల్లల్ని కోల్పోయిన 7 నటులు..!

by Sainath Gopi

Ads

రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా కన్నుమూసిన విషయం తెలిసిందే. కేవలం 16 ఏళ్ళ వయసులో సెప్టెంబరు 19న మీరా ప్రాణాలు తీసుకుంది. ఆమె మరణంతో కోలీవుడ్ విషాదంలో మునిగింది.

Video Advertisement

విజయ్ ఆంటోని కుటుంబం కుమార్తె కోసం కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యంగా విజయ్ ఆంటోనిని ఓదార్చడం ఎవరి తరం కాలేదని తెల్సుతోంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో పిల్లలను కోల్పోయాన నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. విజయ్ ఆంటోనీ:

తమిళ స్టార్ హీరో, దర్శకుడు, నిర్మాత,  మరియు సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ రీసెంట్ గా తన పెద్ద కుమార్తె మీరాను కోల్పోయారు. ఆమె వయసు 16 సంవత్సరాలు. బలవన్మరణానికి పాల్పడింది.
2. అమీర్ ఖాన్:

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావుకు అబార్షన్ అయ్యింది. ఈ బాధకరమైన వార్తను అప్పట్లో అమీర్ ఖాన్ తన బ్లాగ్‌లో షేర్ చేశారు. ఆ తరువాత ఈ జంట సరోగసీ ద్వారా ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడికి తల్లిదండ్రులు అయ్యారు.
3. కాజోల్:

స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లు బాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ కాజోల్. ఆమెకు 2001 లో అబార్షన్ జరగడంతో తన బిడ్డను కోల్పోయింది. ఆ తరువాత ఏడాది కాజోల్ కుమార్తె నైసాకు, ఆ తరువాత కుమారుడు యుగ్‌కు జన్మనిచ్చింది.
netizens comments on heroine kajol4. గోవిందా:

బాలీవుడ్ నటుడు గోవిందా ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. ఆయకు ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. అయితే మరో కుమార్తెను 4 నెలలు వయసులో కోల్పోయాడు. 5. ప్రకాష్ రాజ్:

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ 5 సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకు సిద్ధూని కోల్పోయాడు. అతను గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు టేబుల్ పై నుండి పడి, గాయాల వల్ల  కొన్ని నెలల తర్వాత కన్నుమూశాడు.
6. ప్రభుదేవా:

ప్రముఖ హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన ప్రభుదేవా తన కుమారుడిని చిన్న వయసులోనే అనారోగ్య సమస్యల వల్ల కోల్పోయాడు.
7. శిల్పాశెట్టి:

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు కుమారుడు వియాన్ పుట్టకముందే శిల్పాశెట్టికి  అబార్షన్ కావడంతో బిడ్డను కోల్పోయింది.
Also Read: “సన” ముస్లిం అయినా అమ్మవారిని నమ్ముతారా..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like