నటి సన గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర నుండి వెండితెర వరకు  తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సన. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 600 లకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది.

Video Advertisement

నటి సన ప్రస్తుతం అటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే, ఇటు బుల్లితెర పై పలు సీరియల్స్ లో చేస్తూ బిజీగా బిజీగా ఉన్నారు. సన ముస్లిం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినా అమ్మవారి పాత్రలో నటించింది. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో అడుగగా సన ఏమని చెప్పారో ఇప్పుడు  చూద్దాం..
సన అసలు పేరు షానూర్ సన బేగమ్. ఆమె తండ్రి క్రిష్టియన్, తల్లి ముస్లిం, తల్లిదండ్రుల మతాలు వేరైనప్పటికీ, తెలంగాణలో పుట్టిన సన, ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెరిగింది. ఆమెకు మొదటి నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి ఉన్నా, కుటుంబ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని, వాటి వైపు వెళ్ళలేదు. ఆమెకు టెన్త్ క్లాస్ లోనే పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత సన ఇష్టాలను గుర్తించిన అత్తమామలు ఆమెను చదవించడమే కాకుండా సనకు ఆసక్తి ఉన్న రంగంలోకి వెళ్ళేలా ప్రోత్సహించారని ఒక సందర్భంలో సన చెప్పుకొచ్చారు.
మొదట మోడలింగ్ ఫీల్డ్ లో రెంటరీ ఇచ్చిన సన, ఆ తరువాత యాంకరింగ్ చేశారు.  ఆ తరువాత సినిమాలు, సీరియల్స్. ఇలా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అత్తమామలే అని సన చెప్పుకొచ్చారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో సన టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇటీవల  కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో మూవీలో సన నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ముస్లిం అయ్యి ఉండి అమ్మవారి పాత్ర వేయడానికి కారణం ఏమిటి అడిగారు.
సన మాట్లాడుతూ ” నటిగా ఏ పాత్ర వచ్చినా చేశాను. అలా అమ్మవారిగా నటించాను. ఇప్పుడు హిందూ ముస్లిం అని అంటున్నారు. కానీ, ఆ రోజుల్లో ఇలా మాట్లాడుకునేవాళ్ళు కాదు. అప్పుడు అందరూ హిందువు అనుకున్నారు కానీ ముస్లిం అని అనుకోలేదని అన్నారు. అమ్మవారి పాత్ర ఇచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. తనకు ఆ ఆలోచన రాలేదని అన్నారు. అమ్మవారి ఫోటో ఇచ్చారు. ఆ అమ్మవారే తనను ఎంచుకున్నప్పుడు ఆ పాత్ర చేయను అని చెప్పడానికి నేనెవర్నిని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందుకే ఈ పాత్ర వచ్చిందని, ఇప్పటికీ అమ్మవారిని నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?