Ads
ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. అయితే పుష్ప సినిమా కోసం చాలా మంది నటులని అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆ నటులు ఆ సినిమా చేయలేకపోయారు. అలా పుష్ప లో కొన్ని పాత్రలకి ముందు అనుకున్న నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మహేష్ బాబు
పుష్ప సినిమా మొదట మహేష్ బాబు చేయాలి. కానీ సినిమా అనుకున్న కొద్దిరోజులకే మహేష్, సుకుమార్ ఈ సినిమా చెయ్యట్లేదు అని ప్రకటించారు. ఇంకొక వార్త ఏంటంటే మహేష్ కి సుకుమార్ చెప్పిన కథ ఇది కాదు అని కూడా అంటున్నారు. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
#2 సమంత
సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మొదట రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర కోసం సమంతని సంప్రదించారు. కానీ సమంత ఆ పాత్ర చేయలేకపోయారు.
#3 విజయ్ సేతుపతి
మొదట పుష్ప సినిమా ప్రకటించిన తర్వాత ఎనౌన్స్ చేసిన విలన్ పేరు విజయ్ సేతుపతి. దాంతో అల్లు అర్జున్, విజయ్ సేతుపతి తెరపై కనిపిస్తే చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ చివరి నిమిషంలో విజయ్ సేతుపతి ఈ సినిమా చేయలేకపోయారు. దాంతో విలన్ పాత్రని ఫహాద్ ఫాజిల్ చేస్తున్నారు.
#4 నోరా ఫతేహి
ఊ అంటావా పాట కోసం మొదట నోరా ఫతేహిని సంప్రదించారు. కాని ఆ పాట నోరా ఫతేహి చేయలేకపోయారు.
#5 దిశా పటాని
ఊ అంటావా పాట కోసం దిశా పటాని పేరు కూడా పరిశీలించారు. దిశా పటానిని సంప్రదించిన తర్వాత ఈ పాటని తిరస్కరించారు.
#6 ఊర్వశి రౌతేలా
ఊర్వశి కూడా ఊ అంటావా పాటకి మొదట అనుకున్న వారిలో ఒకరు.
#7 సుమ
ఒక సందర్భంలో సుమ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది. కానీ తర్వాత అది ఒక పుకారు మాత్రమే అని కూడా అన్నారు. కానీ కొంత మంది ఏమో ఒక ముఖ్య పాత్ర కోసం సుమని సంప్రదించారు అని అన్నారు. ఒకవేళ సంప్రదిస్తే, అది ఏ పాత్ర అయ్యుంటుంది అనేది మాత్రం తెలీదు.
అలా వీరు పుష్ప సినిమాలో కొన్ని పాత్రలు చేయలేకపోయారు అని సమాచారం. కానీ ఏదేమైనా సినిమాలో ఆ పాత్రలను పోషించిన నటులకి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది.
End of Article