Ads
సినిమా మరియు రాజకీయాలు ఒకదానితో మరొకటి కలిసిపోయాయి. ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సినిమాలలో ఓ స్థాయికి వచ్చిన తరువాత రాజకీయాలలోకి అడుగుపెట్టారు. వారిలో కొందరు విజయం సాధించి, గొప్ప పదవులలో రాణించారు.
Video Advertisement
సినీ తారలు రాజకీయాలలో విజయం సాధించడంలో వారి కున్న అభిమానుల పాత్ర ఎంతో ఉంటుంది. దక్షిణాదికి చెందిన చాలామంది నటీనటులు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో కొందరు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. అలా సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయిన నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. సిఎన్ అన్నాదురై:
కంజీవరం నటరాజన్ అన్నాదురై తమిళంలో ప్రశంసలు పొందిన రైటర్. ఆయన ఎన్నో నాటకాలకు స్క్రిప్ట్ రాయడమే కాకుండా వాటిలో నటించాడు. అన్నాదురై రాసిన నాటకాలలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. తమిళ సినిమాను పొలిటికల్ ప్రచారానికి ఉపయోగించుకున్న మొదటి వ్యక్తి మరియు తమిళనాడు తొలి ముఖ్యమంత్రి.
2. ఎంజి రామచంద్రన్:
ఎంజిఆర్ గా పాపులర్ అయిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ తమిళంలో గొప్ప నటుడుగా పేరు గాంచాడు. ఆ తరువాత పొలిటిక్స్ లో అడుగుపెట్టి, ముఖ్యమంత్రి అయ్యారు. 1977 నుంచి 1987 వరకు పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా మరణించేవరకు పనిచేశారు. 1988లో మరణానంతరం ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
3. జానకీ రామచంద్రన్:
ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ చనిపోయిన తరువాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె తమిళనాడుకు నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె ప్రసిద్ధ తమిళ నటి.
4. ఎన్టీ రామారావు:
నందమూరి తారకరామారావు తెలుగు ఇండస్ట్రీలో ఎదురులేని నటుడుగా, నటసార్వ వభౌముడిగా మరువలేని సేవలు చేశారు. అగ్రనటుడుగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాలలో అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అలా ఎన్టీఆర్ 3 సార్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
5. జయలలిత:
తమిళులు అమ్మగా పిలుచుకున్న నటి జయలలిత. ఆమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారారు. ఆమె టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే పాలిటిక్స్ లో అడుగుపెట్టి, తమిళనాడు ముఖ్యమంత్రిగా 6 సార్లు, 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన అతి తక్కువ వయసు మొదటి మహిళగా జయలలిత నిలిచారు.
6.ఎం కరుణానిధి
కరుణానిధి తమిళ సాహిత్యంలో తనదైన ముద్ర వేసాడు. పద్యాలు, సినిమాలు, నాటికలు,నవలలు, జీవిత చరిత్రలు, సంభాషణలు, పాటలు వంటి అన్ని రంగాల్లో కూడా కరుణానిధికి ప్రవేశం ఉంది. ఆయన రాజకీయాలలో అడుగుపెట్టి, 5 సార్లు సుమారు 2 దశాబ్దాల పాటు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసారు.
Also Read: “సన్యాసి అయినా కూడా..!” అంటూ… స్పందించిన రజనీకాంత్..! ఏం అన్నారంటే..?
End of Article