హేమమాలిని వేసిన ట్వీట్ రివర్స్ అయిందిగా.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

హేమమాలిని వేసిన ట్వీట్ రివర్స్ అయిందిగా.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

by Anudeep

Ads

బాలీవుడ్ నటి హేమమాలిని ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ప్రస్తుతం ఆమె బీజేపీ ఎంపీ గా మధుర నియోజక వర్గానికి నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె ఎంపీ గా గెలుపొంది ఏడేళ్లు పూర్తి అయినా సందర్భం గా ఎంపీ హేమమాలిని ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేశారు.. ” నేను ఎంపీ గా గెలుపొంది ఏడేళ్లు పూర్తి అయింది.. మీ ప్రేమాభిమానాలతోనే ముందుకు సాగుతున్నాను..” అంటూ ఆమె ట్వీట్ చేసారు. ఆమె సంతోషం గానే ఈ ట్వీట్ చేసిన నెటిజన్లు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.

Video Advertisement

hemamalini

“నిజానికి మీకు ఓటు వేసినందుకు సిగ్గు పడుతున్నాం..” అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేసాడు. మరో నెటిజెన్ ” మీరు ఎంపీ గా గెలిచి ఏడేళ్లయింది. ప్రభుత్వం తో లబ్ది పొందుతూ మీరు సంతోషం గానే ఉన్నారు. కానీ మాకు ఏమి ఉపయోగం..” అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆమె ఆశించి ఉంటారు. కానీ చాల మంది నెగటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇటీవల మధుర నియోజక వర్గం లో కరోనా కారణం గా ఇబ్బంది పడుతున్న ఏడుగురు కి ఆమె ఆక్సిజెన్ సిలిండర్లు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా రోగుల కోసం 60 పడకల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


End of Article

You may also like