“రా రా రమ్మని, రా రా రమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళా”  పాట గుర్తుకు రాగానే గుర్తొచ్చే హీరోయిన్ కళ్యాణి.కెరీర్ తొలినాళ్లల్లో వంశీ డైరెక్షన్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి , ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కేరళ కుట్టి , వరుస తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న కళ్యాణి . కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి రానుంది. ఈ సారి ఏ పాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందో తెలుసా? మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి ఆ తరవాత హీరోయిన్‌గా ఎదిగి దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది కళ్యాణి. ‘శేషు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి, మలి చిత్రం  ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. వెంకటేష్, రవితేజ,జగపతిబాబు లాంటి నటులతో నటించింది.

జగపతిబాబు , కళ్యాణిలది  ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించి బెస్ట్ పెయిర్ గా పేరుగాంచారు. పెళ్లి తర్వాత సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం అయిన  కళ్యాణి  “లక్ష్యం” సినిమాలో జగపతిబాబు సరసన నటించి, వాళ్ల కాంబోని రిపీట్ చేశారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే హీరోయిన్ గా ఛాన్సులు పొందుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హీరోయిన్‌గానే కాకుండా వదినగా, తల్లిగా కూడా నటించిన కళ్యాణి క్రమంగా సినిమాల నుండి దూరం అయింది.

ఇప్పుడు కళ్యాణి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. కానీ ఈ సారి నటిగా కాదు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని పనులను పూర్తి చేసుకున్నకళ్యాణి  చేతన్ శీను అనే హీరోను పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతుంది.దీన్ని స్వయంగా కళ్యాణే నిర్మిస్తుండడం విశేషం .హోళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ పూరి జగన్నాద్ చేత రిలీజ్ చేయించింది.

ఈ సినిమాలో చేత‌న్ శీను, సిద్ధి, సుహాసిసి మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి, శ్వేత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర. త్వర‌లోనే మొద‌లు కానుంది. కళ్యాణిని మలయాళంలో కావేరి అని కూడా పిలుస్తారు.ఈ చిత్ర దర్శకురాలిగా ఆమె పేరును కావేరి కళ్యాణిగా పరిచయం చేసుకుంటున్నారు.

నటిగా సక్సెస్ అయిన  కళ్యాణి,  దర్శకురాలిగా సక్సెస్‌ అవుతుందో లేదో చూడాలి. మరో ముఖ్య విషయం కళ్యాణి పెళ్లి చేసుకున్నది సత్యం సినిమా దర్శకుడు సూర్యకిరణ్ . సుమంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సత్యం అని అందరికి తెలిసిందే.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com