Home Filmy Adda ఇదెక్కడి “ట్రెండ్” తల్లీ..? ఈ నటి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇదెక్కడి “ట్రెండ్” తల్లీ..? ఈ నటి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anudeep

నటులు అన్న తర్వాత వాళ్ళు ఏం పని చేసినా కూడా వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా వల్ల వాళ్ల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలు కూడా బయటకి వస్తాయి. పాపులర్ సీరియల్ నటి కనిష్క సోనీ ఇటీవలే తనను తాను వివాహం చేసుకున్నాను అని ప్రకటించింది.. సోలోగామి లేదా స్వీయ వివాహాన్ని ఎంచుకున్న తర్వాత బయటకు వచ్చిన రెండవ భారతీయ మహిళ ఈమె. గతంలో గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అనే 24 ఏళ్ల యువతి తనను తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచింది.

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది ఒక మధురానుభూతి. అయితే మనిషి ఆధునికత పేరుతో కనీ విని ఎరుగని వింతచేస్తులకు పాల్పడుతున్నాడు. ఒక పురుషుడు ఇంకో పురుషుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అలాగే ఒక స్త్రీ ఇంకో స్త్రీ తో కలిసి డేటింగ్ చేయడం ఇలాంటివన్నీ ఈ క్రమంలోనే పుట్టుకొచ్చిన వింత పోకడలు.

actress kanishka soni comments in her latest instagram post

మన సనాతన ధర్మాన్ని మంటగల్పుతూ ఇలాంటి పెళ్లిళ్లు పాపులర్ అవుతున్న ఈ రోజుల్లో ఎక్కువ సరికొత్త కోణంలో దూసుకొస్తుంది స్వయం వివాహం….. అంటే తనని తాను పెళ్లి చేసుకోవడం. ఈమధ్య ఇలాంటి ఒక పెళ్లి గురించి విన్నామనుకుంటే ఈలోపు పాపులర్ సీరియల్ నటి అయిన కనిష్క సోనీ కూడా తనని తాను వివాహం చేసుకున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆధునికత పేరుతో, ట్రెండు పేరుతో ఇప్పటికే ఎన్నో వితండవాదాలు వినిపిస్తున్న ఈ క్రమంలో పుంజుకుంటున్న ఈ కొత్త పోకడలను చూసి ఎందరో పెద్దలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

actress kanishka soni comments in her latest instagram post

తాను తన జీవితంలో ఇంతవరకు మాట మీద నిలబడే మగాడిని చూడలేదు అని,జీవితాంతం బాధపడే కంటే ఒంటరిగా ఉండడమే ఎంతో మంచిది అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ పేజీలో క్యాజువల్ దుస్తులు ధరించిన ఆమె నుదుటన కుంకుమ మెడలో మంగళసూత్రం ధరించి తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా తాను భారతీయ సంస్కృతిని నమ్ముతారని వివాహం అంటే ప్రేమ మరియు నిజాయితీకి సంబంధించినవని తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

actress kanishka soni comments in her latest instagram post

తాను గుజరాతి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారని పెళ్లి అనేది తనకు చాలా ఇష్టమైన కోరిక అని ఆమె తెలిపారు. తనకు సీరియల్స్ నుంచి కూడా రాని పాపులారిటీ తనని తాను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిందని సరదాగా జోక్ చేశారు.
కనిష్క సోనీ హిందీ సీరియల్ దియా ఔర్ బాతీ హమ్ లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇదే సీరియల్ తెలుగులో ఈతరం ఇల్లాలుగా డబ్ అయి తెలుగు ప్రేక్షకుల మన్నన పొందింది. కనిష్క సోనీ ఈ సీరియల్ లో కవిత పాత్రలో నటించారు. సీరియల్స్ తో పాటు ఆమె కొన్ని చిత్రాల్లో, రియాల్టీ షోలలో కూడా నటించారు. ఏది ఏమైనప్పటికీ ఇంత వరకు ఆమెకి రాని పాపులారిటీ తనను తాను పెళ్లి చేసుకున్నాను అని పెట్టిన ఒక్క పోస్ట్ వల్ల కలగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

You may also like