మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి..?

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి..?

by Mohana Priya

Ads

మొదటి సినిమాతో హిట్ కొట్టిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలా మొదటి సినిమా హిట్ అయితే, ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా అలాగే మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు చాలా మారిపోయారు కూడా. బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ దివ్య భారతి. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా తనే. ఈ ఫోటో 2013 లో తీసిన ఫోటో అని ఆ ఫోటో మీద ఉన్న నంబర్ చూస్తే తెలుస్తోంది.

Video Advertisement

actress old picture on social media

ఇప్పుడు దివ్య భారతి తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదల అయిన పాట సూపర్ హిట్ అయ్యింది. దాంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తమిళనాడులోని కోయంబత్తూర్ లో దివ్య భారతి పుట్టారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ దాటి ఇవాళ ఇంత గొప్ప స్థాయికి ఎదిగారు. బీటెక్ చేసిన దివ్య భారతి, 2015 లో మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్ అనే టైటిల్ గెలిచారు. ఆ సంవత్సరంలోనే మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016 లో ప్రిన్సెస్ ఆఫ్ కోయంబత్తూర్ 2016 టైటిల్ గెలిచారు.

actress old picture on social media

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమా దివ్య భారతికి పేరు తీసుకొచ్చింది. మొదటి సినిమాతోనే ఇంత మంచి రోల్ ఇంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని అందరూ దివ్య భారతిని పొగిడారు. దాంతో వరుసగా అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. అయినా కూడా కేవలం కాన్సెప్ట్ బాగున్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటున్నారు.  ఇప్పుడు తెలుగులో తన మొదటి సినిమా గోట్. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నరేష్ కుప్పిలి, విశ్వక్ సేన్ హీరోగా నటించిన పాగల్ సినిమాకి దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ALSO READ : ఏంటి ధోని భయ్యా ఇది.? ఫాన్స్ వచ్చేదే నీ దర్శనం కోసం.! కెమెరా నీపై ఫోకస్ చేస్తే ఎందుకిలా చేసావ్?


End of Article

You may also like