ఏంటి ధోని భయ్యా ఇది.? ఫాన్స్ వచ్చేదే నీ దర్శనం కోసం.! కెమెరా నీపై ఫోకస్ చేస్తే ఎందుకిలా చేసావ్?

ఏంటి ధోని భయ్యా ఇది.? ఫాన్స్ వచ్చేదే నీ దర్శనం కోసం.! కెమెరా నీపై ఫోకస్ చేస్తే ఎందుకిలా చేసావ్?

by Harika

Ads

ఐపీఎల్ 2024 లో చెన్నై వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో, 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించింది. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి చెన్నైలో ఇది మొదటి ఓటమి. మ్యాచ్ అయిపోయాక, ఈ విషయం మీద చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడారు. “ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇది ఒక మంచి మ్యాచ్. లక్నో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 13-14 ఓవర్ల వరకు మా చేతుల్లో ఉంది. స్టోయినీస్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు”.

Video Advertisement

reason for csk failure in match with lucknow ipl 2024
ఇది ఇలా ఉంటె…చెన్నై మ్యాచ్ జరుగుతుంటే..అభిమానుల కోసం కెమెరామెన్ ధోనీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ధోని దర్శనమిస్తే చాలు అనుకుంటూ…ఒక్క బాల్ ఆడినా చాలు అనుకుంటూ ఉంటారు ఫాన్స్. ధోని ని చూడటం కోసమే మ్యాచ్ కి వచ్చే వారు ఎంతోమంది ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.

17వ ఓవర్‌లో ఎంఎస్ ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండగా…వికెట్ పడితే బాగుండు…ధోని బ్యాటింగ్ కి ఎప్పుడొస్తాడా అంటూ ఫాన్స్ వెయిటింగ్ చేస్తున్న టైం లో…డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ధోనిని కెమరామెన్ ఫోకస్ చేసారు. కెమెరామెన్ ధోనిని పెద్ద స్క్రీన్‌పై చూపించడంతో స్టేడియం అంతా ఒక్కసారి ఈలలు వేశారు. దీన్ని గమనించిన ధోని వాటర్ బాటిల్‌ను కెమెరాపైకి విసురుతున్నట్లు కనిపించాడు. వెంటనే కెమెరామెన్ భయపడిపోయి ఫోకస్‌ను డైవర్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.


End of Article

You may also like