లాక్ డౌన్ వేళ యంగ్ హీరోయిన్ జాలీ రైడ్..! అంతలో రోడ్డు ప్రమాదం…నుజ్జునుజ్జయిన కార్.!

లాక్ డౌన్ వేళ యంగ్ హీరోయిన్ జాలీ రైడ్..! అంతలో రోడ్డు ప్రమాదం…నుజ్జునుజ్జయిన కార్.!

by Anudeep

Ads

లాక్ డౌన్ ప్రకటించింది బుద్దిగా ఇంట్లోకూర్చోమని.. మరీ అత్యవసరం అయితే బయటికి రావొచ్చని ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ ఇతరత్రా విభాగాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచింది. మరి అర్దరాత్రి వేళ ఏం కొంపలు మునిగిపోతున్నాయని బయటికి వచ్చిందో మన హీరోయిన్ . యాక్సిడెంట్ కి గురై ఆసుపత్రి పాలైంది.

Video Advertisement

షర్మిలా మాండ్రే తెలుగులో అల్లరి నరేశ్ సరసన కెవ్వుకేక సినిమాలో నటించింది. మనోడి సినిమాలు సూపర్ హిట్లు కాకపోయినా జనాల్ని నవ్విస్తూ యావరేజ్ టాక్ తెచ్చుకుంటాయి. ఈ సినిమా కూడా అంతే, ఈ సినిమా తర్వాత మన అమ్మడికి అసలు ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో మళ్లీ సొంత భాష అయిన కన్నడవైపెళ్లిపోయి ,బుద్దిగా సినిమాలు చేసుకుంటోంది..ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు కూడా చేతిలో ఉన్నాయి.

లాక్ డౌన్ ప్రకటించేసరికి ఇంట్లోనే ఉండి ఉండి బుర్ర తిరిగినట్టుంది. సరదాగా షికారు చేద్దామని బయటికి వచ్చింది. కొంచెం మందు కూడా తాగినట్టుంది. ఇంకేం మధ్యం మత్తులో కారుని తీస్కెళ్లి స్తంబానికి గుద్దేసింది. బెంగళూరులోని వసంతనగర్ రైల్వే బ్రిడ్జి దగ్గర తెల్లవారుజామున మూడింటికి ఈ ఘటన జరిగింది. జాగ్వార్ కారు స్తంబానికి బలంగా గుద్దుకోవడంతోముందుభాగం నుజ్జునుజ్జయింది.  షర్మిలాకి బలమైన గాయాలయ్యాయి. తనతో పాటు ఉన్న స్నేహితుడు లోకేష్ కూడా గాయాలపాలయ్యాడు.

అంత అర్దరాత్రి వేళ ఎందుకు బయటికి వచ్చారు, ఎక్కడికి వెళ్లొస్తున్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. . మరోవైపు తీవ్ర గాయాలపాలైన హీరోయిన్ పై అసలు జాలిచూపకపోగా, బుద్దిలేక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించలేదు, మీరిలా బుద్దితక్కువ పనులు చేస్తే తిప్పలు  తప్పవు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like