చందమామ హీరోయిన్ “సింధు మీనన్” గుర్తుందా? ఇప్పుడెక్కడ ఉందో తెలుసా? ఎవర్ని పెళ్లిచేసుకుందంటే.?

చందమామ హీరోయిన్ “సింధు మీనన్” గుర్తుందా? ఇప్పుడెక్కడ ఉందో తెలుసా? ఎవర్ని పెళ్లిచేసుకుందంటే.?

by Anudeep

Ads

వైశాలి , చందమామ సినిమాల్లో నటించిన సిందుమీనన్, దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే . భద్రాచలం సినిమా చేసేటప్పుడు సింధు వయసు పదిహేనేళ్లు . ఆ సినిమాలో పాటలు, శ్రీహరి ఫైట్లు , సింధు అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సింధుమీనన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది తెలుసా?

Video Advertisement

సింధు బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. ఆమెకు కార్తీక్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. అతను మొదట్లో కన్నడ మ్యూజిక్ చానల్లో వీజేగా పనిచేసి తరువాత నటుడు అయ్యాడు. సింధు తన మాతృభాషయైన మలయాళమే కాక, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు .

చిన్నతనంలోనే భరత నాట్యం లో శిక్షణ తీసుకుంది సింధు. ఒకసారి భరత నాట్యం పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే  కన్నడ దర్శకుడు కె.వి. జయరాం కు పరిచయం చేయడంతో సినిమాల్లోకి వచ్చింది. అలా 1994 లో రష్మి అనే కన్నడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 1999 లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాలో కథానాయికగా నటించింది. తరువాత 15 ఏళ్లకే తెలుగు లో భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం అనే సినిమాల్లో నటించింది.

తెలుగులో త్రినేత్రం, సిద్ధం, శ్రీరామచంద్రులు వంటి సినిమాల్లో నటించినప్పటికి  చందమామ, వైశాలి మాత్రమే సింధు కెరీర్లో ఇప్పటికి గుర్తిండిపోయే సినిమాలు. వైశాలి, చందమామ సినిమాలు ఇప్పటికి తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంటాయి.  తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది సింధుమీనన్. కెరీర్లో ఆఫర్స్ తగ్గగానే, ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుని కెరీర్ కి గుడ్ బై చెప్పింది.

లండన్ లో సెటిలైన తెలుగు ఐటీ ఎంప్లాయ్‍ ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. పాప స్వెత్లానా మరియు ఒక బాబు. ప్రస్తుతం సింధూ తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ లండన్ లోనే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్బై చెప్పిన సింధుకి మళ్లీ నటించాలనే ఆలోచన లేనట్లు సమాచారం. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని పొందిన సింధు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.


End of Article

You may also like