Ads
కానన్ దేవి, బెంగాలీ సినీ ఇండస్ట్రీలో మొదటి హీరోయిన్. ఆమె నేటి తరానికి తెలియకపోవచ్చు. చిన్నతనంలోనే కానన్ దేవి నటిగా, సింగర్‌గా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి, పురుషాధిపత్యపు రోజుల్లోనే ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్ గా నిలిచింది.
Video Advertisement
సినీ రంగంలో ఎన్నో విజయాలు అందుకున్న కానన్ దేవి నిజ జీవితంలో మొదటి నుండి చివరి వరకు అనేక కష్టాల కడలిలోనే సాగింది. ప్రేక్షకలోకాన్ని తన నటనతో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ అనాధగా 1992లో ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. అసలు కానన్ దేవి ఎవరు? ఆమె కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో ఒక నిరుపేద ఫ్యామిలిలో కానన్ దేవి 1916 ఏప్రిల్ 22న జన్మించింది. రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ కానన్ తల్లిదండ్రులు. కానన్‌కు సంగీతంలో శిక్షణ ఇచ్చే తండ్రి, కొద్దికాలనికే మరణించడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వారి కుటుంబాన్ని వెళ్లగొట్టాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లీకూతుళ్లు డబ్బున్న వారింటిలో పని మనుషులుగా చేరారు. ఉండడానికి ఇల్లు లేని వారికి ఒక బంధువు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు.
కానీ అంతలోనే అతడు తన నిజస్వరూపం చూపించాడు. ఏడేళ్లు కూడా నిండని కానన్ మరియు ఆమె తల్లితో చాకిరీ చేయించుకోవడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది భరించలేకపోయిన కానన్ తల్లితో పాటుగా ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ స్థితిలో కోల్‌కతాను విడిచి తిరిగి హౌరాకు వెళ్ళి, వేశ్యాగృహాలకు దగ్గరలో ఒక గది తీసుకుని ఉన్నారు. ఆ సమయంలో కానన్ ను చూసిన వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె సినీ రంగంలో రాణించగలదని గ్రహించాడు. అలా కానన్ 10 సంవత్సరాల వయసులో ‘జైదేవ్’ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది.
ఆ మూవీ కోసం కానన్ తీసుకున్న నెల జీతం ఐదు రూపాయలు. ఆ తరువాత అవకాశాలు రావడంతో 1928-31 మధ్య బాలనటిగా అనేక సినిమాలు చేసింది. అదే టైమ్ లో సింగర్ గానూ సత్తా చాటింది. శంకరాచార్య, జోరేబరత్, విష్ణుమాయ, రిషిర ప్రేమ్, ప్రహ్లాద్ సినిమాలలో తన నటనతో ఆడియెన్స్ అలరించింది. విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాలలో బాలనటుడిగా చేసింది. ఇక 21 సంవత్సరాలకే హీరోయిన్‌గా నటించిన కానన్ దేవి నటనకు, అందానికి, ఫిదా అవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
తక్కువకాలంలోనే ఆమె సూపర్‌స్టార్‌గా మారింది. పాట పాడినందుకు లక్ష, హీరోయిన్‌గా ఐదు లక్షలు రెమ్యూనరేషన్ అందుకునేది. ఆమె 40 పాటలు పాడగా, సుమారు 57 చిత్రాలలో నటించింది. హీరోలకు మాత్రమే సలాం కొట్టే రోజుల్లో కానన్ ను అందరు మేడమ్ అని పిలిచేవారు. మేడమ్ అనిపించుకున్న తొలి హీరోయిన్ కానన్ దేవి. ఆమె కేఎల్ సెఘల్, ప్రథమేశ్ బరువా, పంకజ్ మాలిక్, పహరి సాన్యల్, అశోక్ కుమార్, చబీ బిస్వాస్ వంటి అగ్ర హీరోలతో నటించి, వారికి తీసిపోని విధంగా కోటీశ్వరురాలిగా ఎదిగింది.
1940 డిసెంబర్‌లో కానన్ బ్రహ్మ సమాజ మెంబర్ అయిన హిరంబ చంద్ర మిత్ర తనయుడు అశోక్ మిత్రాను వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన 5 ఏళ్లకే భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత బెంగాల్ గవర్నర్ వద్ద ఏడీసీగా వర్క్ చేసిన హరిదాస్ భట్టాచార్జిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత హరిదాస్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో అందరూ హరిదాస్ ని కానన్ భర్తగా మాత్రమే చూశారు. ఇది భరించలేకపోయిన హరిదాస్ 1987లో ఏప్రిల్ 4న కానన్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. విడాకులు తీసుకోకుండానే ఇద్దరు విడివిడిగా జీవించారు.
76 ఏళ్ల వయసులో కానన్ దేవి అనారోగ్యంతో 1992లో జూలై 17న మరణించింది. హరిదాస్ కానన్ దేవిని ఆఖరిసారి చూడడానికి కూడా రాలేదు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కానన్ చివరికి ఒక అనాధగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. సినీ ఇండస్ట్రీకి కానన్ దేవి చేసిన సేవలకు గానూ 2011లో తపాలా శాఖ ఆమె పేరిట ఒక స్టాంపును రిలీజ్ చేసింది.
Also Read: సౌందర్య చనిపోయిన నెల తరువాత వాళ్ళింటికి వెళ్ళా..ఎంట్రన్స్ లో చూసి..? ఆమని సంచలన కామెంట్స్..!
End of Article