సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం..! గుండెపోటా లేక ఆత్మహత్య?

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం..! గుండెపోటా లేక ఆత్మహత్య?

by Anudeep

అలనాటి తార, ప్రముఖ నటి వాణిశ్రీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ మృతిచెందారు. శుక్రవారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారని తొలుత వార్తలు వచ్చాయి.. కానీ అభినయ్ ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన వాణిశ్రీ , తమ ఫ్యామిలి డాక్టర్ కరుణాకరన్ నే వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు అనుపమ, అభినయ్ వెంకటేశ్..కాగా అభినయ్ తండ్రి బాటలోనే డాక్టర్ వృత్తి చేపట్టారు.. అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన 36 ఏళ్ల అభియన్ వెంకటేశ్, తర్వాత రామచంద్రన్ కాలేజీలో ప్రొఫెసర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. అభియన్‌కు భార్య, నాలుగేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కుమార్తె  ఉన్నారు.. ఆయన భార్య కూడా డాక్టరే, తను సావిత్రి మనవరాలి హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ప్యాలెస్ పనుల నిమిత్తం అభినయ్ చెంగల్పట్టుకి వెళ్లారని సమాచారం.. మృతి చెందడానికి ముందు రోజు రాత్రి తన కుమారుడితో సరదాగా గడిపారని, ఉదయానికి విగతజీవిగా పడి ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు.. నిద్రలోనే గుండెపోటు రావడంతో చనిపోయారని కొందరు తెలుపగా.. ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నయి.చెంగల్పట్టు నుండి చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి అభినయ్ మృతదేహాన్ని తరలించారు.

చెంగల్‌పట్టులోని ప్యాలెస్‌లో ఆత్యహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అభినయ్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరుగనున్నాయి. అభినయ్ మృతితో తెలుగు చలన చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి పలువురు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

You may also like