“బిజినెస్‌మేన్‌” మూవీలో “కాజల్ ఫ్రెండ్” గా నటించిన నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

“బిజినెస్‌మేన్‌” మూవీలో “కాజల్ ఫ్రెండ్” గా నటించిన నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘బిజినెస్ మెన్’ మూవీ కూడా ఒకటి. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. ఈ చిత్రం మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజ్ కానుంది.

Video Advertisement

పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో మహేష్ బాబుని డిఫరెంట్ పాత్రలో చూపించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో కాజల్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి ఎవరు? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ayesha-shivaపోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘బిజినెస్ మెన్’ మూవీ మహేష్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ చాలా ఆకట్టుకున్నాయి. గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ రీరిలీజ్ అయ్యింది. అప్పుడు మొదలైన రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసగుతూనే ఉంది. ఇక ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బిజినెస్ మెన్’ రీరిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంట. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1.36 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కే ఈ రేంజ్ లో వసూలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో డబ్బు, స్టేటస్ అంటే చాలా ఇష్టపడే పాత్రలో నటించిన అమ్మాయి పేరు ఆయేషా శివ. ఈమె కెనడాలో జన్మించిన భారతీయ నటి. ఈ మూవీలో తన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఆయేషా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. అలా బాలీవుడ్ మూవీలో చూసి, పూరీ జగన్నాథ్ ఆయేషాను ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసాడు. బిజినెస్ మెన్ మూవీ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించలేదు. రీసెంట్ గా ఆయేషాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

https://www.instagram.com/p/Cvk48lxvaOC/

Also Read: ఎవరు ఈ సెలబ్రిటీ స్పందన విజయ్ రాఘవేంద్ర..? ఆమె హఠాన్మరణానికి కారణం ఏంటి..?


End of Article

You may also like