“బాలకృష్ణ” కి అప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు తల్లిగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?

“బాలకృష్ణ” కి అప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు తల్లిగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?

by Harika

Ads

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ “సుహాసిని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే నటి సుహాసిని తన సినిమా జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉన్నారు సుహాసిని. తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం తో ఆమెకు వివాహం జరిగింది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.

Video Advertisement

ఆమె నటన కూడా ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ చీర కట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంది. అందువల్లే ఒకప్పుడు హీరోయిన్ గా నటించినా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అయితే ఆమె వచ్చిన ప్రతీ పాత్రను ఒప్పుకోవడం లేదు. పైగా చాలా సెలెక్టివ్‌గా దర్శకులను చూసి సినిమా ఒప్పుకుంటున్నారు. దానివల్లే సుహాసిని వెండితెరమీద అంతగా కనిపించడం లేదు. ఇటీవల వెబ్ సిరీస్ లో ఏకంగా అమ్మమ్మ పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించారు.

know the actress who acted as balakrishna mother and lead pair..

అయితే సుహాసిని బాలకృష్ణతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. అయితే సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయినిగానే కాకుండా.. తల్లిగా కూడా నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం లో 2014 లో బాలకృష్ణ లెజెండ్ మూవీ లో నటించారు. ఈ చిత్రం లో బాలకృష్ణ కి తల్లి పాత్రలో సుహాసిని కనిపించారు. ఇలా సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయిన్ గా.. తల్లిగా నటించి మెప్పించారు.

know the actress who acted as balakrishna mother and lead pair..

సుహాసిని సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు, ప్రాజెక్ట్‌లు, షోలకు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో సుహాసిని ఫోటో షూట్ చేస్తుంటుంది. ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఆమె కొన్ని తెలుగు చిత్రాలను కూడా చేస్తోన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా సుహాసిని తనకు నచ్చిన పాత్రలను పోషించుకుంటూ వెళ్తోన్నారు. అంతే కాకుండా తమిళ చిత్రాలతోకూడా ఆమె బిజీ గా ఉన్నారు.


End of Article

You may also like