Home Biography భీమ్లా నాయక్‌లో “రానా”కి హీరోయిన్‌గా నటించింది ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

భీమ్లా నాయక్‌లో “రానా”కి హీరోయిన్‌గా నటించింది ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది.

ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: “వీడియోలోని సీన్స్ నే స్క్రీన్‌షాట్ తీశారు కదరా.?” అంటూ… RRR కొత్త పోస్టర్స్‌పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

actress who is seen opposite rana in bheemla nayak

రానా దగ్గుబాటికి హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మొదట ఈ పాత్రలో ఐశ్వర్య రాజేష్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వాళ్ళ ఆ పాత్ర నుండి ఐశ్వర్య తప్పుకున్నారు. రానాకి హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్త, ఇటీవల విడుదలైన అడవి తల్లి మాట పాటలో కనిపించారు. సంయుక్త 2016 లో వచ్చిన పాప్ కార్న్ అనే ఒక మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు.

actress who is seen opposite rana in bheemla nayak

ఆ తర్వాత కొన్ని మలయాళం సినిమాలతో పాటు, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు. భీమ్లా నాయక్ సంయుక్తకి మొదటి తెలుగు సినిమా. ఇంక సినిమా విషయానికొస్తే, మలయాళం రీమేక్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. కథలో మెయిన్ పాయింట్ అదే అయినా కూడా, కొన్ని సీన్స్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారట. ఈ సినిమాకి త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ ప్రధాన బలంగా నిలవబోతున్నాయి అని సినిమా బృందం తెలిపారు.

You may also like