“రాధే శ్యామ్”లో హీరోని ప్రేమించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆ నటి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“రాధే శ్యామ్”లో హీరోని ప్రేమించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆ నటి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

Ads

దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ మొద‌ట చాలా మిక్స్‌డ్‌గా వ‌చ్చింది.

Video Advertisement

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా లేదు అని, చాలా స్లోగా ఉంది అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ లవ్ స్టోరీ అంటే సాధరణంగా చాలా స్లోగా ఉంటుంది. “ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ప్రభాస్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం” అని అంటున్నారు.

actress who played tasha in radhe shyam movie

“ఇలాంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలి” అని చాలా మంది అంటున్నారు. దర్శకుడు రాధా కృష్ణ అంతకుముందు జిల్ సినిమా చేశారు. రెండవ సినిమా అయినా కూడా రాధా కృష్ణ ఇలాంటి సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు అని అంటున్నారు. అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగా చూపించారు అని అన్నారు. ఈ సినిమాలో కొంత మంది కొత్త నటులు కూడా కనిపించారు. వారిలో ఒకరు ప్రభాస్ ని ప్రేమించే అమ్మాయి.

actress who played tasha in radhe shyam movie

image source : Instagram (georgia___lorusso)

ఆ అమ్మాయి పేరు సినిమాలో తాషా. సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో చాలా వెతికారు. అసలు ఎవరు ఈ నటి? ఎక్కడి నుండి వచ్చింది? అంటూ చాలా సెర్చ్ చేశారు. తాషా పాత్ర పోషించిన నటి పేరు జార్జియా లోరుస్సో. జార్జియా లోరుస్సో ఒక ఇటాలియన్ నటి. జార్జియాకి ఇదే మొదటి తెలుగు సినిమా. కనిపించింది కొన్ని సీన్స్ అయినా కూడా చాలా గుర్తింపు పొందారు జార్జియా.


End of Article

You may also like