Ads
ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. పైగా చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది.
Video Advertisement
కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి, బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, క్రితి శెట్టి బాగా నటించారు.
సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం నాగార్జున. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున నటన చాలా మందికి నచ్చింది. నాగార్జున అంత యాక్టివ్ గా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాంతో మళ్లీ బంగార్రాజు పాత్రతో నాగార్జున తెరపై కనిపిస్తే చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. సినిమా విడుదల అయిన సమయం కూడా హిట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించింది. పండగకి విడుదల అవ్వడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపారు.
ఈ సినిమాలో సోగ్గాడే చిన్ని నాయనాలో నటించిన చాలా మంది కూడా ఉన్నారు. అలాగే కొంత మంది కొత్త నటులు కూడా ఈ సినిమాలో నటించారు. చాలా మంది హీరోయిన్లు ఈ సినిమాలో అతిధి పాత్రల్లో నటించారు. ఇందులో ఒక పాత్రలో నటించారు యష్న చౌదరి. యష్న అంతకుముందు ఆర్జేగా, యాంకర్ గా చేసారు. బంగార్రాజు యష్నకి మొదటి సినిమా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా గురించి చెప్తూ, ఇంత మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది అని రాసారు.
End of Article