ఫ్యామిలి బ్యాక్గ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 28 హీరోయిన్లు వీరే..!

ఫ్యామిలి బ్యాక్గ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 28 హీరోయిన్లు వీరే..!

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ తో వచ్చిన హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎంతో మంది ఉన్నారు. ముందు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన కానీ తర్వాత తమ టాలెంట్ ను నిరూపించుకొని స్టార్లుగా ఎదిగారు, తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ఇదే విధంగా సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన యాక్ట్రెస్ లు కూడా చాలామంది ఉన్నారు. వారెవరో చూద్దాం.

Video Advertisement

శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్

ఇటీవల వచ్చిన దొరసాని సినిమా తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది శివాత్మిక. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న మరాఠీ లో హిట్ అయిన నటసామ్రాట్ రీమేక్ రంగ మార్తాండ లో నటిస్తోంది. శివానీ రాజశేఖర్ మొదటి చిత్రం అడవి శేష్ తో టూ స్టేట్స్ తెలుగు రీమేక్. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు పెళ్లి గోల వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతోంది.

మంచు లక్ష్మీ ప్రసన్న

ముందు ఇంగ్లీష్ లో కొన్ని సినిమాలు సీరియల్స్ తో తన కెరీర్ మొదలు పెట్టి తర్వాత తెలుగులో టాక్ షో కాన్సెప్ట్ ని పరిచయం చేసిన వ్యక్తి లక్ష్మీప్రసన్న. బాలనటిగా మోహన్ బాబు నటించిన పద్మవ్యూహం సినిమాలో నటించింది. యాక్టర్ గా తన మొదటి తెలుగు చిత్రం అనగనగా ఒక ధీరుడు. తర్వాత ఎన్నో సినిమాలు చేసింది.అదే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇప్పుడు నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు షోలు నిర్మిస్తూ నటనను కూడా కొనసాగిస్తోంది.

విద్యుల్లేఖ రామన్

తన అసలు పేరు కంటే బుజ్జిమా పేరు తోనే ఎక్కువ ఫేమస్ అయింది విద్యుల్లేఖ. తన తండ్రి మోహన్ రామన్ తమిళ్ లో ఎంతో పేరుపొందిన నటులు. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటారు. విద్యుల్లేఖ అటు తమిళ ఇటు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

సాయేషా సైగల్

తెలుగులో అఖిల్ సినిమా చేసింది. సాయేషా తండ్రి సుమిత్ సైగల్ కూడా నటులే. ఆయన హిందీలో ఎన్నో సినిమాలు చేశారు. అదే కాకుండా ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ సాయేషా కి తాత అవుతారు.సాయేషా ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది.

మంజుల

సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు అయిన మంజుల షో సినిమాలో నటించింది. తర్వాత ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ కి అక్క గా చేసింది. ఏం మాయ చేసావే సినిమాకి నిర్మాత గా వ్యవహరించింది. తర్వాత మనసుకు నచ్చింది సినిమా తో దర్శకత్వం లో కూడా అడుగుపెట్టింది.

సనా కపూర్

హిందీలో ఎంతో గొప్ప నటులైన పంకజ్ కపూర్ కూతురు సనా. షాన్దార్ సినిమాలో నిజజీవితంలో తన తండ్రి అయిన పంకజ్ కపూర్ కి కూతురు గా నటించింది.

కరిష్మా కపూర్, కరీనా కపూర్

కరీనా, కరిష్మా వాళ్ల నాన్న రణధీర్ కపూర్ కూడా ఒకప్పుడు బాలీవుడ్ లో పెద్ద యాక్టర్. తర్వాత కరిష్మా సినిమాల్లోకి వచ్చింది. కొన్నాళ్ళకి కరీనా కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పెద్ద స్టార్ అయింది.

వరలక్ష్మి శరత్ కుమార్

శరత్ కుమార్ మొదటి భార్య కూతురు అయిన వరలక్ష్మి కూడా పొడా పోడి సినిమాతో ఇండస్ట్రీ లో ప్రవేశించింది. ఇప్పుడు తమిళ్, తెలుగు చిత్రాలలో ఎన్నో ముఖ్య పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు ని సంపాదించుకుంది.

అనన్య పాండే

చంకీ పాండే కూతురు అయిన  అనన్య పాండే బాలీవుడ్లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2  సినిమాతో  ఎంట్రీ ఇచ్చింది.  తర్వాత  పతి పత్ని ఔర్ వహ్  సినిమా లో కూడా నటించింది.  ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చే సినిమాతో తెలుగు తెరకు  కూడా పరిచయమవుతోంది.

ప్రీతి విజయ్ కుమార్,    శ్రీదేవి విజయ్ కుమార్,   వనిత విజయ్ కుమార్

 విజయ్ కుమార్ మంజుల కూతుళ్లు అయిన  ప్రీతి, శ్రీదేవి, వనిత కూడా సినిమాల్లో నటించారు. ప్రీతి  విజయ్ కుమార్ రుక్మిణి,  ప్రియమైన నీకు లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది.  శ్రీదేవి ఈశ్వర్,  వీర సినిమాల్లో నటించింది.  వనిత విజయ్ కుమార్ దేవి సినిమాలో సహాయ పాత్ర పోషించింది.  తర్వాత తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చింది.

ట్వింకిల్ ఖన్నా

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ కన్నా కూతురు అయిన ట్వింకిల్ ఖన్నా కూడా బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించింది.  తెలుగులో శ్రీను సినిమా లో వెంకటేష్ కి జోడీగా నటించింది.

ఐశ్వర్య అర్జున్

 తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో ఎన్నో ముఖ్య పాత్రలు పోషించిన అర్జున్ కుమార్తె ఐశ్వర్య.  ఐశ్వర్య ఇప్పుడు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

శ్రద్ధా కపూర్

 బాలీవుడ్ విలన్ శక్తి కపూర్ కూతురు శ్రద్ధ కపూర్ తీన్ పత్తి సినిమాతో  ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.  ఆషికీ 2 సినిమా తనకి స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది.  తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ  సాహో సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బిజీగా  ఉంది శ్రద్ధ.

నిహారిక కొణిదెల

 మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్టమొదటి నటి నిహారిక కొణిదెల.  నాగబాబు కూతురు అయిన నిహారిక ఢీ  ప్రోగ్రామ్ తో యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది.  తర్వాత  ముద్ద పప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ లో చేసింది.   ఒక మనసు సినిమాతో బిగ్ స్క్రీన్ మీద కనిపించింది.  తర్వాత  నాన్న కూచి అనే వెబ్ సిరీస్,  సూర్యకాంతం సినిమా సినిమా చేసింది.  ఈ మధ్యనే నిర్మాతగా మారి  మ్యాడ్  హౌస్  అనే వెబ్ సిరీస్ నిర్మించింది.

అతియా శెట్టి

అతియా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు.  సల్మాన్ ఖాన్ నిర్మించిన హీరో సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.  తర్వాత ముబారకాన్,  మోతిచూర్ చక్నాచూర్  సినిమాల్లో నటించింది.

శృతి హాసన్, అక్షర హాసన్

కమల్ హాసన్ కూతుళ్లు అయిన శృతిహాసన్, అక్షర హాసన్ కూడా  సినిమాల్లో నటిస్తున్నారు.  హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అక్షర హాసన్ హిందీలో రెండు సినిమాలు  చేసింది తర్వాత తమిళ్ లో  అజిత్ నటించిన వివేకం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది.  తర్వాత తన తండ్రి  నిర్మాణంలో వచ్చిన కదరం కొండాన్ లో హీరోయిన్ గా నటించింది.

సోనాక్షి సిన్హా

షాట్  గన్ అని పేరు తెచ్చుకున్న శత్రుఘ్నసిన్హా కూతురు  సోనాక్షి సిన్హా.  దబంగ్ సినిమాతో తెరకి పరిచయమైంది.  తర్వాత ఎన్నో హిందీ సినిమాలు చేసింది.  తమిళ్ లో రజినీకాంత్ తో లింగా సినిమాలో కూడా నటించింది.  ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సోనాక్షి.

సోనమ్ కపూర్

అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్  సావరియా సినిమా తో  తన నటన జీవితం మొదలు పెట్టింది.  సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సుహాసిని 

పరిచయం అక్కర్లేని నటి సుహాసిని.   తన తండ్రి చారుహాసన్ తమిళ్ లో పేరు పొందిన నటులు.  ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ లో హీరో తాత పాత్రలో నటించారు.  చారుహాసన్  ఎవరో కాదు కమల్ హాసన్ కి సొంత అన్న.

టీనా  అహుజా

టీనా  అహుజా బాలీవుడ్ స్టార్ హీరో గోవింద కూతురు.   నర్మద అయిన తన అసలు పేరు ని టీనా గా మార్చుకుని  2015లో సెకండ్ హ్యాండ్ హస్బెండ్ అనే సినిమాతో తో  హిందీ సినిమా ఇండస్ట్రీకి  పరిచయమైంది.  ప్రస్తుతానికి టీనా నటించింది  ఆ ఒక్క చిత్రంలోనే.

కీర్తన పార్తీబన్ 

అమృత సినిమా గుర్తుందా ?  ఆ సినిమాలో అమృత పాత్ర పోషించిన అమ్మాయి మీకు తెలిసే ఉంటుంది.  తనే కీర్తన.  కీర్తన సీత, పార్తీబన్ ల  కూతురు. సీత ఎన్నో తెలుగు తమిళ సినిమాల్లో  తల్లి పాత్రల్లో నటించారు.  అలాగే పార్తీబన్  కూడా ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు.  తెలుగులో డైరెక్టుగా  నటించిన సినిమాలు లేకపోయినా యుగానికొక్కడు,  నేను రౌడీ నే లాంటి డబ్బింగ్ సినిమాలతో  పాపులర్ అయ్యారు. అమృత సినిమా లో తను పోషించిన పాత్రకి కీర్తన జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

చేతన  ఉత్తేజ్

చేతన చిన్నతనంలోనే చిత్రం సినిమాలో నటించింది.  కుక్క కావాలి అని గొడవ చేసేది హీరో తమ్ముడి పాత్ర పోషించింది చేతన  ఏ.   ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా ప్రతి కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించిన ఉత్తేజ్ కూతురు చేతన.   ఈ మధ్యనే పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది చేతన.

సారా అలీ ఖాన్

బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్,  అమృతాసింగ్ కూతురు సారా.  కేదార్ నాథ్,  సింబా,  లవ్ ఆజ్ కల్ 2  సినిమాలు చేసింది.   చేసింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది సారా.  ప్రస్తుతం కూలి నెంబర్ వన్  సీక్వెల్, అత్రంగీ రే  చిత్రాల్లో నటిస్తోంది.

వీళ్లే కాకుండా  ఐశ్వర్య రాజేష్ (రాజేష్) ,  ఆలియా భట్ (సోని రాజ్దాన్,  మహేష్ భట్),   కాజోల్,  తనీషా (తనూజ),  ఐశ్వర్య (లక్ష్మి),  ఇలా ఎంతోమంది నటుల  తల్లిదండ్రులు  నటన రంగానికి చెందిన వారే.


End of Article

You may also like