Home Filmy Adda “పూజా హెగ్డే” అవార్డ్ గెలుచుకోవడం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..? ఆ హీరోయిన్‌కి రావాల్సిన అవార్డ్..?

“పూజా హెగ్డే” అవార్డ్ గెలుచుకోవడం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..? ఆ హీరోయిన్‌కి రావాల్సిన అవార్డ్..?

by Anudeep

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (2021) లో తన నటనకు గాను పూజా హెగ్డే శనివారం ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ ఎంపిక చాలా మందిని ఆశ్చర్యపరిచింది. SIIMA ఈ వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత, సాయి పల్లవి మరియు అభిమానులు ‘రాధే శ్యామ్’ మరియు ‘ఆచార్య’ నటిని ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఆమె తెలుగు లో చేసిన మొదట మూవీ ‘ఒక లైలా కోసం’. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చిన మూవీ మాత్రం ‘డిజె'(దువ్వాడ జగన్నాథం). ఆ తర్వాత ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘గద్దలకొండ గణేష్’ ‘అల వైకుంఠపురములో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి వరస హిట్స్ ఆమె సొంతం అయ్యాయి.

actual reason behind pooja hegde winning best actress award in siima 2022

 

కానీ ఆమె ఇటీవల నటించిన ‘రాధే శ్యామ్’ ‘బీస్ట్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఇప్పుడు 20201 గాను సైమా నిర్వహించిన అవార్డు వేడుకల్లో పూజా ను రెండు అవార్డులు వరించాయి. ‘బెస్ట్ హీరోయిన్’ గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి మరియు ఇంకొకటి సైమా యూత్‌ ఐకాన్‌ అవార్డు కావడం గమనార్హం.అయితే ఈ క్రమంలో బెస్ట్ హీరోయిన్ అవార్డు లవ్ స్టోరీ సినిమాకి గాను సాయి పల్లవికి దక్కాలని. ఆమె ఈ ఫంక్షన్ కి అవైలబుల్ గా లేదు అనే రీసన్ తో ఈ అవార్డును పూజాకి అందించారని ఓ వార్త నెట్ లో హల్చల్ చేస్తోంది.

actual reason behind pooja hegde winning best actress award in siima 2022

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా హెగ్డే పర్ఫామెన్స్ అంత ఆకట్టుకునే విధంగా లేదని .అర్హత లేక పోయినా ఆమెకు అవార్డు వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. ‘ఫిదా’ నటి సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ మరియు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలలో అనూహ్యంగా బ నటించిందని సాయి పల్లవి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.” ఈ రెండు చిత్రాలలో ఒకదానికి కైన ఈ అవార్డు ఆమెకు వచ్చి ఉండాలి” అని ఒక అభిమాని రాశారు.

saranga dariya hindi remake song goes viral

సాయి పల్లవికి అవార్డు ఇవ్వకుండా పూజకి ఎలా ఇచ్చారు అని నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కుంది “అంటూ పూజా అని విమర్శించేవారు ఉన్నారు. కొన్నిసార్లు పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ల అవార్డు ఫంక్షన్ కి వస్తే పబ్లిసిటీ బాగా జరుగుతుంది అని సైమా వంటి సంస్థలు వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది అనాది నుంచి జరుగుతుంది. ఏదేమైనాప్పటికీ ఇలా పూజా హెగ్డే ను ట్రోల్ చేయడం సరికాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

You may also like