Ads
- చిత్రం : ది కేరళ స్టోరీ
- నటీనటులు : అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బాలాని, సిద్ధి ఇద్నాని
- నిర్మాత : విపుల్ అమృతలాల్ షా
- దర్శకత్వం : సుదీప్తో సేన్
- సంగీతం : బిశాఖజ్యోతి, వీరేష్ శ్రీవల్స
- విడుదల తేదీ : మే 5, 2023
Video Advertisement
స్టోరీ :
కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి.. వారి ఆచూకీ ఎక్కడనే కథాంశంతో ది కేరళ స్టోరీ సినిమా రూపొందించారు. విడుదలకు ముందే ఈ చిత్రం పై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.
ఒక నర్సింగ్ కళాశాలలో చేరిన నలుగురు విద్యార్థులు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే షాలిని ఉన్నికృష్ణన్ (అదా శర్మ) ని ఇంటరాగేషన్ చేస్తున్న సమయం లో ఆమె చెబుతున్నట్టుగా సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. హాస్టల్ లో కలిసి జీవిస్తున్న తమను ఇస్లాం మతంలోకి మారడానికి బ్రెయిన్‌వాష్ చేసిన విధానాన్ని.. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి షాలిని వివరిస్తుంది. అదే మిగతా కథ..
రివ్యూ:
ట్రైలర్ తోనే ఈ మూవీ ఎన్నో వివాదాలను మూటగట్టుకుంది. కేరళలో పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడ్డాయి కానీ.. ఈ విమర్శలపై డైరెక్టర్ సుదీప్తోసేన్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడే మూవీపై ఓ అభిప్రాయానికి రావొద్దని.. సినిమా చూశాక.. ఒకవేళ నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామన్నారు.
ఇక నిజ జీవిత కథలతో తెరకెక్కించినట్లు చెప్పిన ఈ మూవీ లో ఆ పరిస్థితులను సరిగ్గా చూపించగలిగారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి సరైన రీతిలో తెరకెక్కించారు. ఇంతవరకు దర్శకుడు సుదీప్తోసేన్ విజయం సాధించారు. ఆయా పాత్రలు అనుభవిస్తున్న బాధ లోకి మనల్ని తీసుకెళ్లారు. హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యూనిజం, ఇస్లాం, షరియా చట్టాలను బోధించే ప్రక్రియ వీటన్నిటిని సవాలుగా తీసుకొని తెరకెక్కించారు.
స్క్రీన్ ప్లే సరిగ్గా కుదిరింది. కానీ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ బాగోలేదు. బిజియం వల్ల కొన్ని సన్నివేశాలు సరిగ్గా ఎలివేట్ కాలేదు. కొన్ని డైలాగ్స్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. లొకేషన్స్ అన్ని బాగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో హింస ఎక్కువైంది.
ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురు బాగా నటించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- స్క్రీన్ ప్లే
- సినిమాటోగ్రఫీ
- ప్రధాన పాత్రల నటన
మైనస్ పాయింట్స్:
- బాక్గ్రౌండ్ మ్యూజిక్
- డైలాగ్స్
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : ఈ సినిమా వెనుక ఉన్న వివాదాలను పక్కన పెట్టి ఒక సినిమాగా చూస్తే ‘ది కేరళ స్టోరీ’ మంచి సినిమా.
End of Article