Ads
టాలీవుడ్ లో వరుసగా సినిమాలని చేస్తూ అడవి శేషు పాపులర్ అవుతున్నారు. విభిన్న కథాంశాలతో ఈ హీరో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా అడవి శేషు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అడవి శేషు ‘మేజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కబోతోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం రానుంది.
Video Advertisement
శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేషు సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, శోభిత దూళిపాళ్ల, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే విధంగా హిట్ 2 లో కూడా అడవి శేషు నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే 36 ఏళ్లు అడవి శేషు కి వచ్చేసినా ఇంకా బ్యాచిలర్ గానే మిగిలిపోయారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చారు.
ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నానని…. కొన్నాళ్లు చూసి చూసి గట్టిగా తిట్టేశారని.. ఇక నేను వినకపోయే సరికి వీడికి చెప్పడం వేస్ట్ అని వదిలేసారు ఇంట్లో వాళ్ళని అన్నారు. అయితే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోందని.. నిజానికి పెళ్లిపై గాలి మళ్ళింది అని అడవి శేషు అన్నారు. అలానే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుందని అనిపిస్తోందని తన మనసులో మాట పంచుకున్నారు అడవిశేషు.
End of Article