“ఆదిపురుష్” లో డిలీట్ చేసిన డైలాగ్ ఏదో తెలుసా..? ఎందుకు తీసేసారు అంటే..?

“ఆదిపురుష్” లో డిలీట్ చేసిన డైలాగ్ ఏదో తెలుసా..? ఎందుకు తీసేసారు అంటే..?

by kavitha

Ads

ఆదిపురుష్‌, ప్రస్తుతం ఎక్కడా విన్నా ఈ మూవీ పేరు వినిపిస్తోంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ విడుదల రోజు వచ్చేసింది. నేడు వరల్డ్ వైడ్ గా ఏడు వేలకి పైగా థియేటర్లలో ఆదిపురుష్‌ సినిమా విడుదలైంది.

Video Advertisement

రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ బుకింగ్స్ తో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాగా, ఒక దేశంలో మాత్రం, సినిమాలోని ఒక డైలాగ్ ని తొలగిస్తేనే రిలీజ్ అయ్యే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో ఆ డైలాగ్ ను డిలీట్ చేశారట. మరి ఆ దేశం ఏమిటో, ఏ డైలాగ్ను, ఎందుకు డిలీట్ చేశారో ఇప్పుడు చూద్దాం..
adipurushఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా నటించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలతో ఆదిపురుష్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నేడు ఈ మూవీ విడుదలైంది. మొదటి షోతోనే పాజిటివ్‌ టాక్‌తో తెచ్చుకుంది. ఇప్పటికే బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.
adipurushప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో ఈమూవీని రిలీజ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే, అయితే నేపాల్ లో ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలెన్ షా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దానికి కారణం ఈ సినిమా ట్రైలర్ లో “సీత భారతదేశపు కుమార్తె” అనే డైలాగ్ ఉంది.
ఈ డైలాగ్ పై ఖాట్మండు మేయర్ బాలెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీత జన్మస్థలం గురించిన మిస్టేక్ ను సరిచేయాలని ఆదిపురుష్‌ మేకర్స్ ను కోరారు. ఇదే విషయం పై నేపాల్ సెన్సార్ ప్యానెల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అందువల్ల ఆ డైలాగ్ ని సినిమా నుండి డిలీట్ చేశారని తెలుస్తోంది.

Also Read: ADIPURUSH REVIEW : “ప్రభాస్” ఈ సినిమాతో అయినా హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like