“ఆదిపురుష్” ఫైట్ సీన్ కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి అంటే..?

“ఆదిపురుష్” ఫైట్ సీన్ కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి అంటే..?

by kavitha

Ads

భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన చిత్రం ఆదిపురుష్. మొదటి షో దగ్గర నుండి ఈ చిత్రం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పై సినీ ప్రముఖులు సైతం  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Video Advertisement

ఈ క్రమంలోనే ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయాలని నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ సీన్స్, లంక సెట్ ను హాలీవుడ్ సినిమల నుండి కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ లోని రాముడు యుద్ధం చేసే సన్నివేశాన్ని కూడా కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
adipurush-copied-iconic-avengersఆదిపురుష్ చిత్రం పై వివాదాలు, విమర్శలు ఆగడం లేదు. డైరెక్టర్ ఓంరౌత్ రామాయణాన్ని అపహాస్యం చేస్తూ  ఆదిపురుష్ మూవీని రూపొందించాడని విమర్శిస్తున్నారు. రాముడు, రావణ, హనుమ క్యారెక్టర్ల కాస్ట్యూమ్స్, డైలాగ్స్ విషయంలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు కూడా చిత్రబృందం  పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బ్యాన్ చేయాలంటున్నారుఆదిపురుష్‌లోని రావణుని లంక అచ్చం థోర్ అస్గార్డ్ లాగా ఉందని, ఆ మూవీ నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆదిపురుష్‌లోని పోరాట సన్నివేశాలను కూడా హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాముడు పోరాటం చేసే సీన్ ను ‘ది ఎవెంజర్స్’ నుండి ఐకానిక్ ఎవెంజర్స్ అసెంబుల్ సీన్‌ కాపీ చేశారంటూ రెండు సీన్స్ ను పొలుస్తూ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. వీటి పై నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్, ట్రోల్స్  చేస్తున్నారు.

https://www.instagram.com/reel/Cto98inhwE1/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాని ట్రోల్ చేస్తున్న వారికి… చిలుకూరు ప్రధాన అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

 


End of Article

You may also like