ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాని ట్రోల్ చేస్తున్న వారికి… చిలుకూరు ప్రధాన అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాని ట్రోల్ చేస్తున్న వారికి… చిలుకూరు ప్రధాన అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న విడుదలై, మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. సోషల్ మీడియాలో దర్శకుడు, రచయిత పై విపరీతమైన ట్రోలింగ్, ఈ చిత్రం పై వ్యతిరేకత వస్తోంది. ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు విమర్శిస్తూనే ఉన్నారు.

Video Advertisement

తాజాగా అల్ ఇండియా సినీవర్కర్స్ అసోసియేషన్ ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రముఖ ఆలయ పూజరి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా, మూవీని అందరు తప్పక చూడాలని చెబుతున్నారు. మరి చిలుకూరి బాలాజీ ఆలయ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
Priest-Rangarajan-on-Adipurush-1బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీ రాముడిగా, సీతగా హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ మూవీలో రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, వేషధారణ పై వివాదాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ప్రశంసలు కురిపించారు.
పూజారి రంగరాజన్ మాట్లాడుతూ,  ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి శ్రీ రాముడి గుణాలు గురించి అంతా  వెతుకుతున్నారని, ఆదిపురుష్ లో చూపించినట్లుగానే రామాయణం ఉందా? వేరే విధంగా ఉందా అని వెతుకుతున్నారు. ప్రపంచమంతా రాములవారి గురించి మాట్లాడేటట్టు చేసినందుకు ఆదిపురుష్ మూవీ యూనిట్ ను అభినందిస్తున్నాను.
ఇక రావణాసురుడు, శ్రీరాముడు, హనుమంతుడు ఇలా చూపించారని సోషల్ మీడియాలో విమర్శించేవారిని ఉద్దేశించి, ఆదికవి వాల్మీకిలగా రామాయణాన్ని ఎవరు తీయలేరు. వేరే ఎవరు ప్రయత్నం చేసినా దానిలో ఏదో కొదవ ఉంటుందని అన్నారు. దానిని గుర్తించి ఆ ప్రయత్నాన్ని అభినందించాలని, ప్రతీ ఒక్కరు కూడా రాములవారి వైభవాన్ని కీర్తించే ఈ మూవీని తప్పకుండా చూడాలని అన్నారు.

watch video :

Also Read: ఇంతకు మించిన అవమానం లేదు… అందరినీ 50 డిగ్రీల సెల్ఫీయస్ లో తగలబెట్టేయాలి..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like