“ఆదిపురుష్‌” థియేటర్లలో హనుమంతుడి కోసం రిజర్వ్ చేసిన సీట్‌లో ఏం చేస్తారో తెలుసా..?

“ఆదిపురుష్‌” థియేటర్లలో హనుమంతుడి కోసం రిజర్వ్ చేసిన సీట్‌లో ఏం చేస్తారో తెలుసా..?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్‌ 16న రీలీజ్ అవుతుండగా, జూన్ 15 అర్థరాత్రి నుండి ప్రీమియర్‌ కానుంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పై భారీగా అంచనాలు ఉన్నాయి.

Video Advertisement

ఇప్పటికే  ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ట్రైలర్‌, సాంగ్స్ తో ఆదిపురుష్‌ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక మేకర్స్ ఆదిపురుష్‌ థియేటర్లలో ఒక సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని అన్నారు. తాజాగా ఈ విషయం గురించి అప్డేట్ వచ్చింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
adipurush-multiplex-owners-1ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా నటిస్తున్న ఆదిపురుష్‌ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరక్కెకించారు. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు ను కేటాయించాలని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ లో మల్టీప్లెక్స్ లలో ఒక సీటును ఏర్పాటు చేస్తున్నట్టు, దాని పై ఆంజనేయస్వామి విగ్రహం లేదా ఫోటోను పెట్టి, ప్రతిరోజూ ఆంజనేయస్వామికి పూలను సమర్పించబోతున్నట్లుగా ఒక న్యూస్ పోర్టల్ తెలిపింది. ఇక ఆంజనేయస్వామి కోసం కేటాయించిన సీటు ముందువరుసలో కార్నర్ లో ఉంటుదని తెలిపింది.
ఇటీవల దర్శకుడు ఓంరౌత్ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు. ఓంరౌత్ మాట్లాడుతూ మా అమ్మగారు రామాయణం పారాయణం చేసినపుడు కానీ, శ్రీరాముడి గాథను ప్రదర్శించిన, లేదా కథను చెప్పిన  అక్కడికి హనుమంతుడు తప్పక వస్తాడని చెప్పేవారని అన్నారు. అందువల్ల హనుమనుతుడి కోసం ఆదిపురుష్ థియేటర్లలో ఒక సీటును కేటాయించాలని నిర్మాతల భూషణ్ కుమార్ ను, డిస్ట్రిబ్యూటర్లను కోరారు.

Also Read: “తమన్నా” నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ జీ కర్దా ఎలా ఉంది..? ప్రేక్షకులని అలరించిందా..?


End of Article

You may also like