ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాకి వచ్చిన నష్టం ఎంతో తెలుసా..?

ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాకి వచ్చిన నష్టం ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

భారీ అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రం భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Video Advertisement

కానీ గ్రాఫిక్స్ సరిగ్గా లేని కారణంగా మరియు కొన్ని డైలాగ్స్ కారణంగా ఈ చిత్రం విపరీతమైన నెగెటివిటీని ఫేస్ చేసింది. జూన్ 16వ తారీఖున విడుదలైన ఈ చిత్రం పది రోజులు కూడా గడవకముందే బ్యాన్ చేయాలి అనే రేంజ్ లో ప్రేక్షకులు డిమాండ్ చేశారు అంటే చిత్రంపై ఎటువంటి దుష్ప్రభావం పడి ఉంటుందో ఆలోచించండి.

స్వర్ణ లంకను బొగ్గు లంకగా చూపించడం, హనుమంతుడి చేత మాస్ డైలాగ్స్ చెప్పించడం లాంటి పలు అభ్యంతర సన్నివేశాల వల్ల ఈ చిత్రానికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు సినిమాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ మరియు పోస్ట్ ల వల్ల చిత్రం ఇమేజ్ కూడా బాగా దెబ్బతినింది. దీని ప్రభావం నేరుగా సినిమా కలెక్షన్స్ మీద పడింది.సినిమా విడుదలైన వీకెండ్ తీసి పక్కన పెడితే ఆ తర్వాత కలెక్షన్స్ పెద్దగా ఏమీ రాలేదు.

raavan-in-adipurush

ఈ మూవీ ని నమ్ముకొని భారీ కలెక్షన్స్ వస్తాయని ఆశించిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ యజమానులు లబోదిబోమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలుపుకొని 82 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ మరియు 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ఈ చిత్రం సంపాదించింది. ఇక కర్ణాటకలో 12 కోట్లు ,తమిళనాడులో 2.40 కోట్లు , కేరళలో 87 లక్షలు రాబట్టింది. ఇక హిందీలో విడుదలైన ఈ చిత్రం నార్త్ ఇండియా అంతా కలిపి 70 కోట్ల షేర్ కలెక్షన్స్ సంపాదించింది.

Adipurush

ఓవర్సీస్ పరిస్థితి అంతే…వీకెండ్ లో మంచి కలెక్షన్స్ వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా అక్కడ కూడా సినిమా కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి. మొత్తానికి 25 కోట్ల రేంజ్ వరకు షేర్ వసూలు అయ్యాయి అని తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తానికి ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో కలిపి 240 కోట్లు వసూలు చేసింది అంటే ఇంకా దగ్గర దగ్గర 49 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ తగ్గాయి. అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడిలో దాదాపు 45 కోట్లకు పైగా నష్టం వచ్చిందని అర్థం. కంటెంట్ కనెక్ట్ కాకపోతే ఎంత భారీ చిత్రమైనా బోల్తా పడాల్సిందే అనడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్.


End of Article

You may also like