“ఆదిపురుష్” బృందం ఇలా చేసి పొరపాటు అయితే చేయట్లేదు కదా..?

“ఆదిపురుష్” బృందం ఇలా చేసి పొరపాటు అయితే చేయట్లేదు కదా..?

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ చిత్రం రామాయణం నేపథ్యంతో రూపొందుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

ఆ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్  ఏ విషయంలోనూ వెనకాడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్ గా రూపొందిన ‘ఆదిపురుష్’ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అయితే మూవీ యూనిట్ తప్పు చేశారేమో అని అంటున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్ తో పాటు 2 పాటలను కూడా రిలీజ్ చేశారు. వీటికి రెస్పాన్స్ బాగా వచ్చినప్పటికీ, ప్రమోషన్ విషయంలో యూనిట్ పై విమర్శలు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సాంగ్స్ ను లిరికల్ గా కాకుండా పూర్తి వీడియోలు రిలీజ్ చేశారు. అంటే మూవీ కంటెంట్ లో చాలా భాగాన్ని రిలీజ్ కు ముందే చూపించినట్లు అయ్యింది.ఇటీవల రిలీజ్ అయిన ‘రాం సీతా రాం’ సాంగ్ లో రామాయణంలోని ప్రధానమైన దృశ్యం అయిన శ్రీరాముడు సీతాదేవి కలుసుకునే సన్నివేశాన్ని చూపించారు. భావోద్వేగంతో కూడిన ఈ సిన్ ను సాంగ్ లో చూపించి పెద్ద పొరపాటు చేశారని చెప్పవచ్చు. అలాంటి ముఖ్యమైన సన్నివేశాలను ముందే చూపించడం వల్ల మూవీ ఆ సన్నివేశం  ఎప్పుడు వస్తుందో తెలిసిన ఆడియెన్స్ అంతగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఇది మూవీ యూనిట్ చేసిన పొరపాటని అంటున్నారు.ఇక ఈ మూవీని ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడంలో  ‘ఆదిపురుష్’ యూనిట్ సాంగ్స్ రూపంలో విజయం  సాధించింది. అయితే ఉత్కంఠటను కలిగించే సీన్స్ ముందే చూపించడం వల్ల అసలైన ఫీల్ ను ఆడియెన్స్ మిస్ అయ్యేలా మూవీ యూనిట్ చేసింది. మరి ఇక నుండి ఇచ్చే మూవీ అప్డేట్ ల విషయంలో అయినా చిత్ర యూనిట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అంటున్నారు.

Also Read: తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కి రాకముందు… కృష్ణ మాట్లాడిన ఈ స్పీచ్ చూసారా..?


End of Article

You may also like